Rahul Gandhi : భిన్నాభిప్రాయాలతో సమస్య లేదు – రాహుల్
అశోక్ గెహ్లాట్..సచిన్ పైలట్ పై కామెంట్స్
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సీఎం అశోక్ గెహ్లాట్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం గెహ్లాట్ , సచిన్ పైలట్ మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరుపై మీ కామెంట్ ఏంటి అన్న ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
పార్టీలో భిన్నమైన అభిప్రాయాలు ఉండడం సహజమన్నారు. ఇందువల్ల తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు. ఆయన పరోక్షంగా భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ నియంతృత్వ పార్టీ కాదన్నారు. ఫాసిస్ట్ లక్షణాలు కలిగిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలో లేరన్నారు.
అలా ఉండడానికి వీలు లేదన్నారు. పార్టీ అన్నాక భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు కలిగి ఉండడం సర్వ సాధారణమని ఇది అసలైన ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుందన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). పార్టీకి నష్టం కలిగించనంత వరకు అభిప్రాయాలను వ్యక్తం చేయడం మంచిదేనని పేర్కొన్నారు.
అయితే సీఎం అశోక్ గెహ్లాట్ విధేయులు ముగ్గురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారని కానీ ఇంత వరకు ఏ చర్య తీసుకోలేదన్నారు. ఇవన్నీ టీ కప్పులో తుపాను లాంటివన్నారు. రాజస్థాన్ ఒక్కటే కాదు దేశంలోని పలు రాష్ట్రాలలో నాయకులు, కార్యకర్తలు చెప్పిన విషయాలను పార్టీ తప్పక వింటుందని చెప్పారు రాహుల్ గాంధీ.
Also Read : రాహుల్ పై రాథోడ్ ఫైర్