Nobel Physics 2022 : ముగ్గురు ఫిజిక్స్ శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్

ప్ర‌క‌టించిన స్వీడీష్ అత్యున్న‌త సంస్థ

Nobel Physics 2022 : ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన అవార్డుగా భావించే నోబెల్ పుర‌స్కారాన్ని ఈ ఏడాది 2022కు(Nobel Physics 2022) గాను ప్ర‌క‌టించింది. ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం) లో విస్తృత‌మైన ప‌రిశోధ‌న‌లు చేసినందుకు గాను ఎంపిక చేసిన‌ట్లు తెలిపింది. అవార్డులకు సంబంధించిన వివ‌రాల‌ను మంగ‌ళ‌వారం నోబెల్ బ‌హుమ‌తి సంస్థ అధికారికంగా వెల్ల‌డించింది.

ప్ర‌యోగాత్మ‌క సాధ‌నాల అభివృద్ది క్వాంటం టెక్నాల‌జీ కొత్త శ‌కానికి పునాది వేసింద‌ని పేర్కొంది. రెండు క‌ణాలు విడి పోయిన‌ప్పుడు కూడా ఒకే యూనిట్ లా ప్ర‌వ‌ర్తించే చిక్కుబ‌డ్డ క్వాంటం స్థితుల‌ను ఉప‌యోగించి సంచ‌ల‌నాలత్మ‌కంగా ప్ర‌యోగాలు చేశార‌ని కితాబిచ్చింది.

ఇందుకు గాను శాస్త్ర‌వేత్త‌లు అలైన్ ఆస్పెక్ట్ , జాన్ ఎఫ్ క్లాజ‌ర్ , ఆంటోనీ జైలింగ‌ర్ ల‌కు 2022కు గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తి ల‌భించింది. క్వాంటం స‌మాచారం ఆధారంగా ఫ‌లితాలు కొత్త సాంకేతిక‌త‌కు మార్గం సుగ‌మం చేశాయ‌ని పేర్కొంది అవార్డు ప్ర‌ధాన సంస్థ నోబెల్.

అద్భుత‌మైన ప్ర‌యోగాల‌ను ఉప‌యోగించి అలైన్ ఆస్పెక్ట్ , జాన్ క్లాజ‌ర్ , ఆంటోన్ జైలింగ‌ర్ చిక్కుబ‌డిన స్థితిలో ఉన్న క‌ణాల‌ను ప‌రిశోధించే , నియంత్రించ‌గ‌ల సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని పేర్కొంది. చిక్కుకున్న జ‌త లోని ఒక క‌ణానికి ఏం జ‌రుగుతుందో న‌నే దానిని నిగ్గు తేల్చారు.

ఈ ముగ్గురు చేసిన ప్ర‌యోగాలు కొత్త ప్ర‌యోగానికి నాంది అవుతుంద‌ని తాము భావిస్తున్న‌ట్లు నోబెల్ ప్రైజ్ ఎంపిక క‌మిటీ పేర్కొంది. వైజ్ఞానిక ప్ర‌పంచంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిస్సందేహంగా ఈ బ‌హుమ‌తిని కొన్ని ద‌శాబ్దాలుగా ఇస్తూ వ‌స్తోంది స్వీడీష్ సంస్థ‌.

దీని విలువ 10 మిలియ‌న్ స్వీడీస్ రూపాయ‌లు. సైన్స్ , సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల‌లో సాధించిన విజ‌యాల ఆధారంగా పుర‌స్కారాలు అంద‌జేస్తున్నారు.

Also Read : తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Leave A Reply

Your Email Id will not be published!