DK Shiva Kumar : కర్ణాటకలో ఎవరికీ రక్షణ లేదు – డీకే
కేపీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్
DK Shiva Kumar : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్(DK Shiva Kumar) షాకింగ్ కామెంట్స్ చేశారు. కర్ణాటకలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తనను తాను రక్షించు కోలేని స్థితిలో ఉందన్నారు.
ఈ తరుణంలో రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం డీకే శివకుమార్ జాతీయ మీడియా ఎఎన్ఐ తో మాట్లాడారు.
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఇది కాకతాళీయంగా జరుగుతున్నట్టు తనకు అనిపించడం లేదన్నారు.
వారు ఎవరినీ రక్షించే స్థితిలో లేరన్నారు. తమను తాము రక్షించు కోలేని వారు ఈ రాష్ట్రాన్ని, ప్రజలను ఎలా రక్షిస్తారంటూ ప్రశ్నించారు డీకే శివకుమార్. బీజేవైఎం కార్యకర్త ప్రవీణ్ నట్టారు దారుణ హత్యకు గురి కావడం బాధాకరమన్నారు.
ఈ ఘటనను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ హత్యపై వెంటనే న్యాయ విచారణ జరగాలని కేపీసీసీ చీఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రాణం ఎవరిదైనా ప్రాణమేనని ఆ కుటుంబానికి తాము తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు డీకే శివకుమార్. ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు.
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. పూర్తి బాధ్యతా రాహిత్యంతో ఉండడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు డీకే శివకుమార్(DK Shiva Kumar).
మొత్తంగా బొమ్మై ప్రభుత్వం చోద్యం చూస్తోందా అని ప్రశ్నించారు కేపీసీసీ చీఫ్. ఇదిలా ఉండగా డీకే చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : కార్యకర్తల్లో ఆగ్రహం సహజం
Since this govt has come, there are various incidents taking place. They're not able to protect anyone. Let there be a fair investigation, we shouldn't politicalise this issue. We condemn this incident: Karnataka Congress chief DK Shivakumar on BJP Yuva Morcha worker's murder pic.twitter.com/vwOGOuFW4U
— ANI (@ANI) July 28, 2022