Non Locals Allowed : జమ్మూ కాశ్మీర్ లో స్థానికేత‌రుల‌కు ఓటు

అభ్యంత‌రం చేస్తున్న రాజ‌కీయ పార్టీలు

Non Locals Allowed : జ‌మ్మూ కాశ్మీర్ లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 2019లో ఆర్టిక‌ల్ 370 ప్ర‌కారం కేంద్రం ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని ర‌ద్దు చేసింది.

దీని త‌ర్వాత తొలిసారిగా జ‌మ్మూ కాశ్మీర్ లో స్థానికేత‌రులు ( నాన్ లోక‌ల్ )(Non Locals Allowed) ఓట‌ర్లుగా న‌మోదు చేసుకునేందుకు ఓట‌ర్ల జాబితాల ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ అనుమ‌తించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది కేంద్రం.

కాగా జ‌మ్మూ కాశ్మీర్ లో నాలుగు సంవ‌త్స‌రాల‌కు పైగా ఎన్నికైన ప్ర‌భుత్వం లేకుండా పోయింది. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌లో కొన‌సాగుతోంది. ఉగ్ర‌వాదుల దాడులు ముమ్మ‌రం అయ్యాయి.

సాధార‌ణ పౌరులు, ప్ర‌ధానంగా కాశ్మీర్ పండిట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉండ‌గా జమ్మూ కాశ్మీర్ లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో 25 ల‌క్ష‌ల మంది కొత్త‌గా ఓట‌ర్లు ఉండే అవ‌కాశం ఉంది.

స్థానికత‌రులు ఈ ప్రాంతంలో తొలిసారిగా ఓటు హ‌క్కు న‌మోదు చేసుకున్నారు. కాగా మాజీ సీఎంలు మెహ‌బూబా ముఫ్తీ, ఒమ‌ర్ అబ్దుల్లా దీనిని త‌ప్పు ప‌ట్టారు.

ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసేందుకు ఇది ప్ర‌మాద‌ర‌క‌ర‌మైన ప్ర‌య‌త్నం అని ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా గురువారం జ‌మ్మూ కాశ్మీర్ చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ హిర్దేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు .

ఎన్నిక‌ల‌కు ముందు ఈ ప్రాంతంలో 20 లక్ష‌ల‌కు పైగా కొత్త ఓట‌ర్లు న‌మోదు కావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ప్ర‌స్తుతం ఉన్న 76 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌కు అద‌నంగా మూడో వంతు కంటే ఎక్కువ ఓట‌ర్ల సంఖ‌ఖ్య పెర‌గ‌వ‌చ్చ‌ని అంచ‌నా.

భార‌త దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు ఉన్న‌ట్లే జ‌మ్మూ కాశ్మీర్ లో నివ‌సిస్తున్న లేదా ప‌ని చేసే ఎవ‌రైనా అక్క‌డ ఓటు వేయొచ్చ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : కాంగ్రెస్ పార్టీలో లేఖల‌ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!