#NonStopFlight : హైద‌రాబాద్ టు షికాగో ఫ్ల‌యిట్

నాన్ స్టాప్ ఫ్ల‌యిట్ తో ప్ర‌యాణికులు ఖుషి

Non Stop Flight  : ప్ర‌పంచంలోనే అత్యంత సౌక‌ర్య‌వంత‌మైన న‌గ‌రాల్లో హైద‌రాబాద్ చోటు సంపాదించుకుంది. ఐటీ, లాజిస్టిక్‌, ఫార్మా, టెలికాం, త‌దిత‌ర రంగాల‌కు చెందిన బ‌డా కంపెనీలు ఇక్క‌డ కొలువు తీరాయి. టెక్నాల‌జీ పుణ్య‌మా అని ఉపాధి అవ‌కాశాలు మెరుగు ప‌డ్డాయి. ఇక్క‌డి నుంచి ఇత‌ర దేశాల‌కు, ప్రాంతాల‌కు రాక పోక‌లు త‌ప్ప‌నిస‌రిగా మార‌డంతో విమాన ప్ర‌యాణానికి గిరాకీ పెరిగింది. దీంతో ఆయా విమాన‌యాన సంస్థ‌ల‌న్నీ ఆఫ‌ర్లు, ప్యాకేజీల‌తో రా ర‌మ్మంటూ ప్ర‌యాణికుల‌కు గాలం వేస్తున్నాయి.

అంత‌ర్జాతీయంగా జిఎంఆర్ కంపెనీ మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా షికాగో వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ప్ర‌త్యేకంగా నాన్ స్టాప్ ప్రారంభించ‌నుంది. షికాగో నుంచి బుధ‌వారం బ‌య‌లు దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ – 777 ఫ్ల‌యిట్ మ‌రుస‌టి రోజు రాత్రి 12.50 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటుంది. ఇదే విమానం తిరిగి మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12.50 గంట‌ల‌కు ఇక్క‌డి నుంచి టేకాఫ్ అయి నేరుగా షికాగో బ‌య‌లు దేరుతుంద‌ని ఎయిర్ ఇండియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ప్ర‌తి శుక్ర‌వారం శంషాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు నుంచి షికాగో విమాన స‌ర్వీసు వెళుతుంది. ఈ విమానంలో 238 మంది ప్ర‌యాణం చేసేందుకు వీలుంది. ఇందులో 8 మొద‌టి త‌ర‌గ‌తి కాగా 25 బిజినెస్ క్లాస్, 195 ఎకాన‌మీ క్లాస్ సీట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. గ‌తంలో షికాగో వెళ్లాల‌ని అనుకునే వారికి ఇబ్బందులు ఉండేవి. రెండు లేదా మూడు చోట్ల విమానాలు మారాల్సి వ‌చ్చేది. ప్ర‌యాణికుల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు చేసింది ఎయిర్ ఇండియా.

No comment allowed please