BRSS Viral : బీఆర్ఎస్ కాదు అది బీఆర్ఎస్ఎస్
నెట్టింట్లో బీఎస్పీ ఫోటో వైరల్
BRSS Viral : భారత రాష్ట్ర సమితి కాదని అది బీఆర్ఎస్ఎస్ అంటూ ఎద్దేవా చేసింది బీఎస్పీ. ఈ మేరకు మోదీ, కేసీఆర్ కలిసి ఉన్న ఆర్ఎస్ఎస్ ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. గత కొంత కాలం నుంచీ బీఆర్ఎస్ అనుమానాస్పదంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. తాజాగా మరాఠాలో బీఆర్ఎస్ సభలు నిర్వహించడం కేవలం కాంగ్రెస్ , ఎన్సీపీ ఓటు బ్యాంకును చీల్చేందుకే నంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.
దీంతో బీఆర్ఎస్ , బీజేపీ బంధం గట్టిగా ఉందని బీఎస్పీ పేర్కొంది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ కు సంబంధించి అన్ని బిల్లులకు మద్దతుగా నిలిచింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించింది. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్(BRS) ఒక పథకం ప్రకారం ఓటు బ్యాంకు చీల్చే పనిలో పడిందని స్పష్టం చేసింది. ఎన్సీపీ చీఫ్ చేసిన ఆరోపణలతో ఇది మరింత రూఢీ అయ్యిందని పేర్కొంది.
పైకి తిట్టుకోవడం లోపట బంధం గట్టిగా ఉండేలా చూసుకోవడం తప్పితే ఇంకేమీ లేదని తెలిపింది. లిక్కర్ స్కాంలో ప్రధాన పాత్ర ఉందని సీబీఐ చెప్పినా ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలని పేర్కొంది. మొత్తంగా బీఆర్ఎస్ కాదదని బీఆర్ఎస్ఎస్ అన్న క్యాప్సన్ అదిరింది. ఒకవేళ బంధం లేదని తేలితే వెంటనే కల్వకుంట్ల కుటుంబం చేసిన దోపిడీపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది బీఎస్పీ.
Also Read : Bandi Sanjay JP Nadda : 25న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సభ