Devendra Fadnavis : ఈడీ కాదు ‘ఏక్ నాథ్ దేవేంద్ర’ సర్కార్
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం ఫడ్నవీస్
Devendra Fadnavis : శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ కలిసి కొత్తగా మహారాష్ట్రలో కొలువు తీరిన ప్రభుత్వం ఇవాళ జరిగిన బలపరీక్షలో నెగ్గింది.
ఈ సందర్భంగా బీజేపీకి చెందిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) మీడియాతో మాట్లాడారు. మాదీ ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) ప్రభుత్వమని ఎద్దేవా చేస్తున్నారు.
ఈడీ సర్కార్ అంటే అర్థం ఏక్ నాథ్ షిండే , దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి ఏర్పాటు చేసిన సర్కార్ అని విపక్షాల వారికి తెలియక పోవడం దారుణమన్నారు. తాము విమర్శలను పట్టించు కుంటామని కానీ వ్యక్తిగతంగా ఎవరినీ కించ పర్చమన్నారు ఫడ్నవీస్.
ప్రజాస్వామ్యంలో పవర్ గేమ్స్ అనేవి కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఏక్ నాథ్ షిండేతో కలిసి, మరోసారి శివసేన పార్టీతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్పారు దేవేంద్ర ఫడ్నవీస్.
నా పార్టీ ఆదేశం మేరకు తాను ఉప ముఖ్యమంత్రి అయ్యానని, తాను విలువలకు, సిద్దాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తినని చెప్పారు. వారికి ఇది ప్రభుత్వం కాదని ఎలా అనిపిస్తోందో వారికే తెలియాలన్నారు.
ఇదిలా ఉండగా బల పరీక్ష కు సంబంధించి శాసన సభలో ఓటింగ్ జరుగుతున్న సమయంలో తిరుగుబాటు దారులు ఏక్ నాథ్ షిండే కు (Eknath Shinde) మద్దతు ఇచ్చినప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుగా ఈడీ ఈడీ అంటూ అరిచారు.
పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సోమవారం జరిగిన బలపరీక్షలో ఏక్ నాథ్ షిండే – భారతీయ జనతా పార్టీకి కలిపి 164 సీట్లు వచ్చాయి. మహా వికాస్ అఘాడీగా ఏర్పడిన శివసన, కాంగ్రెస్, ఎన్సీపీలకు 99 సీట్లు పోల్ అయ్యాయి.
Also Read : భద్రత లేకుండా ప్రజల్లోకి వెళ్లలేరు – రౌత్