Shashi Tharoor : స్ప‌ష్ట‌త త‌ప్ప‌ ఘ‌ర్ష‌ణ కోసం కాదు – థ‌రూర్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన కాంగ్రెస్ ఎంపీ

Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌కు సంబంధించి పూర్తి పారద‌ర్శ‌కంగా ఉండాల‌ని కోరుతూ ఐదుగురు ఎంపీలు లేఖ రాయ‌డం క‌ల‌క‌లం రేగింది. పార్టీ చీఫ్ ప‌ద‌వి కోసం వ‌చ్చే అక్టోబ‌ర్ 17న జ‌ర‌గ‌నుంది.

ఈ ఎన్నిక‌పై ప‌లువురు ఎంపీలు, సీనియ‌ర్ నాయ‌కులు అనుమానం వ్య‌క్తం చేశారు. ఎన్నిక పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండాల‌ని కోరారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ గా మ‌ధు సూద‌న్ మిస్త్రీ ఉన్నారు.

లేఖ దుమారం రేగ‌డంతో పార్టీ స్పందించింది. మార్పులు చేసేందుకు ఓకే చెప్పింది. ఈ విష‌యంపై స్పందించారు ఎంపీ శ‌శి థ‌రూర్. ఎల‌క్ష‌న్ ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధు సూద‌న్ మిస్త్రీ ఇచ్చిన క్లారిటీపై సంతోషం వ్య‌క్తం చేశారు.

అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవకాశం ఉన్న శ‌శి థ‌రూర్(Shashi Tharoor) తో స‌హా కొంత మంది కాంగ్రెస్ స‌భ్యుల ఆందోళ‌న చెందారు. ఆదివారం శ‌శి థ‌రూర్ మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స్ప‌ష్ట‌త‌, వివ‌ర‌ణ కోస‌మే తాము లేఖ రాశామ‌ని కానీ ఘ‌ర్ష‌ణ ప‌డేందుకు కాద‌న్నారు శ‌శిథ‌రూర్.

ఇదిలా ఉండ‌గా మ‌ధు సూద‌న్ మిస్త్రీకి తాము రాసిన లేఖ దురుద్దేశ పూర్వ‌కంగా లీక్ అయ్యింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు మిస్త్రీతో తాను ఫోన్ లో మాట్లాడాన‌ని చెప్పారు.

తామంతా వ్య‌తిరేకులం కాద‌ని, విశ్వాసంతో కూడిన పార్టీకి సంబంధించిన కార్య‌క‌ర్త‌ల‌మ‌ని స్ప‌ష్టం చేశారు శ‌శి థ‌రూర్. ఇదిలా ఉండ‌గా శ‌శి థ‌రూర్ , మ‌నీష్ తివారీ, కార్తీ చిదంబ‌రం, ప్ర‌ద్యుత్ బోర్డ్ లోయ్ , అబ్దుల్ ఖ‌లేఖ్ ల‌తో స‌హా ఐదుగురు ఎంపీలు లేఖ రాసిన వారిలో ఉన్నారు.

Also Read : ఎంపీల లేఖ‌తో కాంగ్రెస్ లో క‌ద‌లిక

Leave A Reply

Your Email Id will not be published!