Sachin Pilot : రాజస్థాన్ లో రాజకీయం మరింత ముదిరి పాకాన పడింది. ఎవరు సీఎంగా ఉంటారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాను మాత్రం ఎక్కడికీ వెళ్లే ప్రసక్తి లేదంటూ కుండబద్దలు కొట్టారు ప్రస్తుత సీఎం, సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్. ఇదే సమయంలో 90 మందికి పైగా ఎమ్మెల్యేలు తాము రాజీనామా చేసేందుకు వెనుకాడబోమంటూ హెచ్చరించారు.
ఆపై తాము సీఎంగా సచిన్ పైలట్(Sachin Pilot) ను ఒప్పుకోమంటూ కుండబద్దలు కొట్టారు. అంతే కాకుండా జైపూర్ కు వచ్చిన పరిశీకులు అజయ్ మాకెన్, మల్లికార్జున్ ఖర్గేలను కలిసేందుకు కూడా వారు ఒప్పుకోలేదు. దీనిపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. విచిత్రం ఏమిటంటే నిన్నటి దాకా అశోక్ గెహ్లాట్ గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్నారు.
అంతే కాకుండా తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని ప్రకటించారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ చేసిన ఒకే ఒక్క కామెంట్ కలకలం రేపింది. ఒకరికి ఒకే పదవి ఉంటుందని, రెండో పదవి ఉండదని స్పష్టం చేశారు. దీంతో రాజస్థాన్ సీఎం పదవి ఉంటుందా ఊడుతుందా అన్నది తెలియడం లేదు.
ఈ తరుణంలో తదుపరి సీఎం రేసులో ఉన్న సీనియర్ నాయకుడు సచిన్ పైలట్(Sachin Pilot) ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆయన నిత్యం టచ్ లో ఉన్నారు.
తాను హైకమాండ్ తో మాట్లాడానని, ఇదే సమయంలో అశోక్ గెహ్లాట్ ను కంట్రోల్ ఉండమని సూచించాంటూ తాను కోరినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు సచిన్ పైలట్. పూర్తిగా అబద్దమని కొట్టి పారేశారు. ఇదంతా కావాలని జరుగుతున్న ప్రచారంగా మండిపడ్డారు.
Also Read : ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం – మాన్