CM KCR : టీఆర్ఎస్ కాదు ఇక బీఆర్ఎస్ – కేసీఆర్

ప్ర‌క‌టించిన టీఆర్ఎస్ చీఫ్‌, సీఎం

CM KCR :  తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ చీఫ్ , ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర్ రావు(CM KCR) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టికే తాను చెబుతూ వ‌స్తున్న‌ట్లుగా ద‌స‌రా పండుగ బుధ‌వారం రోజు జాతీయ పార్టీ పేరును ఫిక్స్ చేశారు.

ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌టించారు కేసీఆర్. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఇదో మైలురాయిగా పేర్కొన‌వ‌చ్చు. రాష్ట్ర చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయానికి తెర తీశారు కేసీఆర్.

ఒక‌ప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ధ్యేయంగా ఉద్య‌మాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత కొత్త రాష్ట్రం సిద్దించిన త‌ర్వాత దానిని తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీగా మార్చేశారు.

ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా ప్ర‌క‌టించారు. రెండోసారి తెలంగాణ‌లో ప‌వ‌ర్ లోకి వ‌చ్చారు కేసీఆర్. ఆ త‌ర్వాత దేశ రాజ‌కీయాల‌లో కీల‌క పాత్ర పోషించాల‌ని డిసైడ్ అయ్యారు. విజ‌య ద‌శ‌మిని పుర‌స్క‌రించుకుని మంచి ఘ‌డియ‌లు చూసుకుని ముహూర్తం ఖ‌రారు చేశారు.

21 ఏళ్ల త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర స‌మితిని భార‌త రాష్ట్ర స‌మితిగా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కేసీఆర్. దీనినే కొత్త పార్టీగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

దేశ ప్ర‌జ‌ల అభ్యున్న‌తిని కాంక్షిస్తూ పార్టీని ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు కేసీఆర్(CM KCR). ఇదిలా ఉండ‌గా కొత్త పార్టీ అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికే న‌మోదై ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితిని భార‌త రాష్ట్ర స‌మితిగా మార్పు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా టీఆర్ఎస్ పేరును మారుస్తూ ఇవాళ నిర్వ‌హించిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో తీర్మానం చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్ర‌తినిధులు తీర్మానంపై సంత‌కం చేశారు.

Also Read : మున్సిపాల్టీల‌కు రూ. 2 కోట్ల చొప్పున న‌జ‌రానా

Leave A Reply

Your Email Id will not be published!