TS Govt : అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 80 వేల 39 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు. వస్తాయో రావోనన్న ఉత్కంఠలో ఉన్నారు నిరుద్యోగులు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ(TS Govt) లో 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇంకా బయట 50 లక్షల మంది ఉన్నారు. దాదాపు 80 లక్షల మంది జాబ్స్ కోసం వేచి ఉన్నారు. ఈ తరుణంలో నోటిఫికేషన్లు వచ్చినా గతంలో కోర్టుకు వెళ్లడం, పిటిషన్లు దాఖలు చేయడం, ఫలితాలు వెల్లడిలో జాప్యం జరగడం షరా మామూలై పోయింది.
నోటిఫికేషన్లు వచ్చి భర్తీ చేసేంత దాకా తమకు నమ్మకం లేదని అంటున్నారు నిరుద్యోగులు. ఈ తరుణంలో తాజాగా సీఎస్ సోమేశ్ కుమార్(TS Govt) కీలక ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఒకటి రెండు రోజుల్లో వయో పరిమితికి సంబంధించి సడలింపు చేస్తూ జీవోలు ఇవ్వాలని ఆదేశించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ తో సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేల 39 పోస్టులను ప్రత్యక్ష పద్ధతి ద్వారా భర్తీ చేస్తోంది ప్రభుత్వం.
ఇక అన్ని శాఖలు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, బ్యాక్ లాగ్ పోస్టులు, రోస్టర్ పాయింట్లను ఫైనల్ చేసి , ఆర్థిక శాఖ పర్మిషన్ తో ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు సీఎస్.
ఖాళీ పోస్టులన్నింటికీ ఒకేసారి కాకుండా దశల వారీగా ఇవ్వాలని సూచించారు. కాగా జాబ్స్ వచ్చేంత వరకు నమ్మకం లేకుండా పోతోందని బాధితులు వాపోతున్నారు.
Also Read : పిల్లలకు పాఠ్యాంశంగా భగవద్గీత