Neil Chandran : యుఎస్ లో ఎన్నారై నీల్ చంద్ర‌న్ అరెస్ట్

45 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డి మోసం

Neil Chandran : అమెరికాలో ప్ర‌వాస భార‌తీయుడు (ఎన్నారై) నీల్ చంద్ర‌న్(Neil Chandran)  అరెస్ట్ అయ్యాడు. 45 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డి మోసానికి పాల్ప‌డిన ఆరోప‌ణ‌ల‌పై అదుపులోకి తీసుకున్నారు.

నీల్ చంద్ర‌న్ త‌మ ఐటీ కంపెనీలో పెట్టుబ‌డి పెడితే ఎక్కువ రాబ‌డి వ‌స్తుందంటూ న‌మ్మించాడు. ఈ మేర‌కు మోసానికి పాల్ప‌డిన‌ట్లు ఫిర్యాదులు అందాయి.

ఇదిలా ఉండ‌గా నీల్ చంద్ర‌న్ (Neil Chandran) కు చెందిన కంపెనీలు స్వంత క్రిప్టో క‌రెన్సీతో స‌హా వ‌ర్చువ‌ల్ వ‌ర‌ల్డ్ టెక్నాల‌జీల‌ను అభివృద్ది చేశాయి. 10,000 వేల మందికి పైగా బాధితుల‌ను $45 మిలియ‌న్ల‌కు పైగా మోసం చేశాడ‌ని ఆరోప‌ణ‌లున్నాయి.

నీల్ చంద్ర‌న్ కు విలాస‌వంత‌మైన కార్లు, రియ‌ల్ ఎస్టేట్ పేరుతో భారీగా డ‌బ్బులు వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డాడు. 50 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన నీల్ చంద్ర‌న్ టెక్ ఫౌండ‌ర్ కూడా. అమెరికా నెవాడా లోని లాస్ వెగాస్ కు చెందిన నీల్ చంద్ర‌న్ ను అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

నేరారోప‌ణ ప్ర‌కారం నీల్ చంద్ర‌న్ త‌న కంపెనీల‌లో ఒక‌టి లేదా అంత కంటే ఎక్కువ బ్యాన‌ర్ తో నిర్వహిస్తున్న కంపెనీల‌లో పెట్టుబ‌డులు పెట్టించాడ‌ని, వారికి అధిక రాబ‌డి పేరుతో ఆశ పెట్టాడ‌ని తెలిపారు.

ప‌లు కంపెనీల‌ను ఏర్పాటు చేశాడు. ఇదిలా ఉండ‌గా నీల్ చంద్ర‌న్ స్థాపించిన కంపెనీల‌లో ఫ్రీ వి లాబ్ , స్టూడియో వి ఇంక , వి డెలివ‌రీ ఇంక్ , వి మార్కెట్ వింక్ , స్కాలెక్స్ యుఎస్ఏ ఇంక్ ఉన్నాయి.

కంపెనీలు స్వంత మెటా వ‌ర్స్ లో ఉప‌యోగించు కోవ‌డం కోసం వారి స్వంత క్రిప్టో క‌రెన్సీతో స‌హా వ‌ర్చువ‌ల్ వ‌ర‌ల్డ్ టెక్నాల‌జీని అభివృద్ది చేసింది.

Also Read : ఇల్లినాయిస్ లో రాజా కృష్ణ‌మూర్తి గెలుపు

Leave A Reply

Your Email Id will not be published!