Suvella Braverman : యుకె హొం సెక్ర‌ట‌రీగా ఎన్నారై సువెల్లా

ఇప్ప‌టి వ‌ర‌కున్న ప్రీతి ప‌టేల్ రాజ‌నామా

Suvella Braverman : ప్ర‌వాస భార‌తీయులు ప్ర‌పంచ వ్యాప్తంగా త‌మ‌దైన ముద్ర‌ను క‌న‌బ‌రుస్తున్నారు. అటు అమెరికా లోనూ ఇటు బ్రిట‌న్ లోనూ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

తాజాగా యుకెలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి జ‌రిగిన రేసులో విదేశాంగ శాఖ నిర్వ‌హిస్తున్న లిజ్ ట్ర‌స్ ప్ర‌ధాన మంత్రిగా ప్ర‌వాస భార‌తీయుడైన రిషి సున‌క్ పై విజ‌యం సాధించారు.

బోరిస్ జాన్స‌న్ నేతృత్వంలో కీల‌క హోం శాఖ కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప్రీతి ప‌టేల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో కీల‌క‌మైన ఆ పోస్టులో మ‌రో ప్ర‌వాస భార‌త‌యురాలైన సువెల్లా బ్రేమ‌ర్ మ‌న్(Suvella Braverman) నియ‌మితుల‌య్యారు.

ఇది ఒక ర‌కంగా భార‌త దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా ఆమెను హోం సెక్ర‌ట‌రీగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. 42 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన సువెల్లా బ్రేవ‌ర్ మన్ ఇప్ప‌టి వ‌ర‌కు జాన్స‌న్ స‌ర్కార్ లో అటార్నీ జ‌న‌ర‌ల్ గా ని చేశారు.

కొత్తగా ఎంపికైన లిజ్ ట్ర‌స్ ఆమె పేరును ప్ర‌త్యేకంగా ప్రస్తావించ‌డం విశేషం. సువెల్లా ఇంగ్లాండ్ లోని ఫేర్ హామ్ కు చెందిన క‌న్జ‌ర్వేటివ్ పార్ల‌మెంట్ స‌భ్యురాలిగా ఉన్నారు.

ఇక సువెల్లా త‌ల్లి ఉమాది త‌మిళ‌నాడు. తండ్రి గోవాకు చెందిన క్రిస్టీఈ ఫెర్నాండెజ్. త‌ల్లి మారిష‌స్ నుండి యుకెకు వెళ్ల‌గా ఆమె తండ్రి 1960లో కెన్యా నుండి వ‌ల‌స వ‌చ్చారు.

చ‌ట్ట ప‌ర‌మైన స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు గాను సువెల్లాకు కీల‌క‌మైన హోం శాఖ కార్య‌ద‌ర్శి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం జ‌రిగింద‌ని బ్రిట‌న్ స‌ర్కార్ పేర్కొంది.

Also Read : ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ ర‌వి నారాయణ్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!