PM Modi Welcome : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం ఆయన అమెరికా టూర్ లో ఉన్నారు. ఆ దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ , ప్రథమ మహిళ జిల్ బైడెన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు. వైట్ హౌస్ లో విందు కోసం ఆహ్వానించారు. అంతకు ముందు మోదీ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్య రాజ్య సమితిలో యోగా సెషన్ కు ప్రాతినిధ్యం వహించారు.
ఇదిలా ఉండగా ప్రధాని మోదీ బైడెన్ కు, జిల్ బైడెన్ కు అద్భుతమైన కానుకలు అందజేశారు. దీంతో వారు మోదీని ప్రత్యేకంగా అభినందించారు. వైట్ హౌస్ లోపలికి వెళ్లే ముందు మోదీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు జోసెఫ్ బైడెన్ . ఇక భారత్ , చైనా నుంచి ఎక్కువగా అమెరికాలో స్థిర పడిన వారు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఎక్కువగా ఉన్నారు. మోదీ రాక సందర్భంగా ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున గుమి గూడారు. ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
వైట్ హౌస్ వెలుపల తనకు వెల్ కమ్ చెప్పేందుకు వేచి ఉన్న వారందరిని చూసి తన మనసు ఉప్పొంగి పోయిందని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). వారి మద్దతు తనకు మరింత బలాన్ని ఇచ్చిందన్నారు. ఇరు దేశాల మధ్య బంధం బలపడేందుకు మీరే కారణమని ఈ సందర్భంగా స్పష్టం చస్త్రశారు మోదీ.
Also Read : Mamata Banerjee : లాలూ పాదాలు తాకిన దీదీ
