Bihar Youtuber : బీహార్ యూట్యూబర్ పై ఎన్ఎస్ఏ కేసు
వలసదారులపై తమిళుల దాడి ప్రచారం
Bihar Youtuber : బీహార్ వలసదారులపై దాడులు జరుగుతున్నాయంటూ నకిలీ వీడియోలను షేర్ చేసిన బీహార్ కు చెందిన యూట్యూబర్ మనీష్ కశ్యప్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా తమిళనాడులో కశ్యప్ పై నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) కింద మరో కేసు నమోదు కావడం గమనార్హం.
తమిళనాడులోని మధురై క్రైం బ్రాంచ్ పోలీసులు మనీష్ కశ్యప్(Bihar Youtuber) పై కేసు నమోదు చేసింది. ప్రత్యేక పోలీసు బృందం (సిట్ ) బీహార్ లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుంది. యూట్యూబర్ ను తమిళనాడులో బీహార్ వలస కార్మికులపై ఫేక్ వీడియోలను వ్యాప్తి చేసినందుకు అరెస్ట్ చేశారు. గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయడం కలకలం రేపింది.
మనీష్ కశ్యప్ పై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మధురై పోలీస్ సూపరింటెండెంట్ శివ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం బీహారీ వలస కూలీలపై దాడులు జరుగుతున్నట్లు నకిలీ వీడియోలను ప్రసారం చేసిన మనీష్ కశ్యప్(Bihar Youtuber) ను ఎన్ఎస్ఏ చట్టం కింద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
కశ్యప్ ను మధురై జిల్లా కోర్టులో హాజరు పర్చగా అతడిని 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించారు. అనంతరం మధురై సెంట్రల్ జైలుకు మార్చారు.
Also Read : హోం మంత్రిగా ఫడ్నవీస్ ఫెయిల్