Nupur Sharma : మరోసారి సుప్రీంకోర్టుకు నూపుర్ శర్మ
అన్ని కేసులు ఢిల్లీకి మార్చాలని దావా
Nupur Sharma : ప్రవక్త మహ్మద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చివరకు తన ప్రాణానికే మప్పు తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మ(Nupur Sharma) మరోసారి హాట్ టాపిక్ గా మారారు.
రెండోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు తనకు ప్రాణ రక్షణ కల్పించమంటూ. ఇప్పటికే విచారించిన కోర్టు సంచలన కామెంట్స్ చేసింది. ప్రధానంగా నోటిని అదుపులో పెట్టుకోక పోవడం వల్లే ఈ దారుణాలు దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్నాయంటూ ధర్మాసనం పేర్కొంది.
ఈ మొత్తం అల్లర్లకు నీతి మాలిన, దుందుడుకు మాటలే కారణమని స్పష్టం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో దాఖలైన ఎఫ్ఐఆర్ లను ఒకే చోటుకు చేర్చాలని నూపర్ శర్మ గతంలో కోర్టును కోరారు.
అయితే కోర్టు తిరస్కరించింది. మరోసారి కోర్టును ఆశ్రయించింది. విచిత్రం ఏమిటంటే ఏ కోర్టు ధర్మాసనం అయితే ఆమె పిటిషన్ ను తిరస్కరించిందో అదే ధర్మాసనం మరోసారి నూపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించడం విచిత్రం.
జూలై 1న ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేసింది బెంచ్. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ సూర్యకాంత్ మరోసారి బుధవారం విచారించనుంది. ఢిల్లీలోని ఎఫ్ఐఆర్ లతో పాటు అన్ని ఇతర కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలంటూ కోరింది.
దేశంలో జరిగిన అల్లర్లకు పూర్తి బాధ్యత నూపుర్ శర్మ(Nupur Sharma) వహించాల్సి ఉంటుందని ధర్మాసనం కుండ బద్దలు కొట్టింది. రెండో సారి కోర్టును ఆశ్రయించే లోపు మరో మూడు కేసులు నూపుర్ శర్మపై నమోదయ్యాయి.
Also Read : నీట్’ లో ‘బ్రా’ తొలగించారంటూ ఆరోపణ