NV Ramana Gaddar : గద్దర్ కు వందనం – ఎన్వీ రమణ
ఆయన చిరకాల మిత్రుడు
NV Ramana Gaddar : ప్రజా గాయకుడు గద్దర్ లేరని తెలిసి బాధ పడ్డాను. ఆయనను చివరి సారిగా ఇలా చూస్తానని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు భారత దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ నూతలపాటి వెంకట రమణ(NV Ramana). సోమవారం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించారు. ప్రజా వాగ్గేయ కారుడికి నివాళులు అర్పించారు.
NV Ramana Gaddar is a man of the people
అనంతరం మీడియాతో మాట్లడారు మాజీ సీజేఐ ఎన్వీ రమణ. అసాధారణమైన ప్రతిభ కలిగిన ప్రజా గాయకుడు గద్దర్ అని కొనియాడారు. ఆయనకు తనకు చిరకాల మిత్రుడు అని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన ఆట, పాటలతో చైతన్యవంతం చేసిన అరుదైన గాయకుడు గద్దర్ అని ప్రశంసించారు.
ఆయన ఆశయాలను ముందుకు తీసుకు పోవాల్సిన బాధ్యత గద్దర్ ను అనుసరించే వారిపై ఉందన్నారు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ఇలాంటి గాయకులు అరుదుగా జన్మిస్తారని అన్నారు. ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండడం వల్ల తాను చాలా ఫీల్ అవుతున్నానని పేర్కొన్నారు. జనం కోసం గానం చేసిన గాయకుడి శరరీరంలో తూటాలు పెట్టుకుని చివరి దాకా పోరాటం చేయడం గొప్పనైన విషయమన్నారు.
Also Read : Gaddar Final Rites : ప్రజా యుద్ద నౌక అంతిమ యాత్ర
