NV Ramana : దేశ మంతటా సంచలనం కలిగించిన దిశ ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతల పాటి వెంకట రమణ(NV Ramana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో శుక్రవారం విచారణ పూర్తయింది. ఈ మేరకు సీజేఐ స్పందిస్తూ ఈ కేసులో దోషులు ఎవరు అనేది దిశ కేసుపై ఏర్పాటైన కమిషన్ గుర్తించింది. ఇందులో దాచి పెట్టాల్సింది ఏమీ లేదు.
కానీ ఒక రకంగా చెప్పాలంటే అత్యంత సున్నితమైన కేసు. అందుకే బహిరంగ వ్యాఖ్యలు చేయడానికి వీలు లేదు. ఇది న్యాయ పరమైన పరిధిలో తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు.
అందుకే పూర్తి నివేదిక వచ్చింది. అసలు విషయం తెలిసింది. అందుకే తుది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను తెలంగాణ హైకోర్టుకే వదిలి వేస్తున్నామని, ఈ మేరకు దిశ కేసును బదిలీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana).
ఈ నివేదికను హైకోర్టుకు అందించాలని ఆదేశించారు. చట్ట ప్రకారం ముందు వెనుకా ఆలోచించి ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సీనియర్లతో కూడిన కమటీకి రిపోర్టును అందజేయాలని తెలిపారు. పూర్తిగా సున్నితమైన, భావోద్వేగాలతో కూడుకున్న అంశం కాబట్టి నివేదికను బహిర్గతం చేయలేమని పేర్కొంది.
ఈ నివేదిక గనుక బయటకు వస్తే సమాజంలో అనేక పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం నెలకొందని అభిప్రాయ పడింది. కేసు విచారణ సందర్భంగా ఆర్టీసీ ఎండీ, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ హాజరయ్యారు.
Also Read : టైం కావాలన్న సిద్దూ కుదరదన్న కోర్టు