NV Ramana :భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశమంతటా ఉద్యోగాలు ఎలా తగ్గించాలని చూస్తున్నాయని కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు.
తాము అడిగిన వెంటనే జాబ్స్ భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రశంసించారు. ఇప్పటి వరకు 4 వేల 320 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడం అభినందనీయమని తెలిపారు ఎన్వీ రమణ(NV Ramana).
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అన్వయ కన్వెన్షన్ సెంటర్ లో న్యాయాధికారుల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సీజేఐ ఎన్ వి రమణతో పాటు ఏపీ, తెలంగాణ చీఫ్ జస్టిస్ లు సతీష్ చంద్ర మిశ్రా, ప్రశాంత్ కుమార్ మిశ్రా హాజరయ్యారు.
వీరితో పాటు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం సీజేఐ ఎన్వీ రమణను(NV Ramana) ఆకాశానికి ఎత్తేస్తే రమణ సైతం సీఎంను పొగడ్తలతో ముంచెత్తారు. ఒకరిపై మరొకరు ప్రశంసల జల్లులు కురిపించారు.
తాము అడిగిన వెంటనే బెంచ్ లను 24 నుంచి 43 కి పెంచారని తెలిపారు సీఎం. ఇదిలా ఉండగా తాము కోరిన వెంటనే ఆలస్యం చేయకుండా పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. న్యాయ వ్యవస్థను బలపరిచేందుకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందని చెప్పారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.
హైకోర్టులతో పాటు జిల్లాల కోర్టులలో కూడా జడ్జీల సంఖ్య పెంచుతున్నామని చెప్పారు.
Also Read : రైతులను పట్టించుకోని కేసీఆర్