Om Prakash Chautala : మాజీ సీఎం చౌతాలాకు జైలు శిక్ష
రూ. 50 లక్షల జరిమానా
Om Prakash Chautala : ఇప్పటికే జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన హర్యానా రాష్ట్ర మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయనకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువురించింది శుక్రవారం.
ఈ మేరకు ఆదాయానికి మించి ఎక్కువగా ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో 4 సంవత్సరాల పాటు జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల భారీ జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
దీంతో చౌతాలా ఫ్యామిలీ ఆందోళనకు గురైంది. ఇదిలా ఉండగా గతంలో హర్యానా రాష్ట్రంలో తాను సీఎంగా ఉన్న సమయంలో జరిగిన టీచర్ల నియామక కుంభకోణం కేసులో 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు .
ఈ మాజీ సీఎం వయసు ప్రస్తుతం 87 ఏళ్లు. గత ఏడాది 2021 జూలైలో విడుదలయ్యారు. 2000 సంవత్సరంలో ఏకంగా 3,206 మందిని అక్రమంగా టీచర్లుగా నియమించారు.
అప్పట్లో దేశ వ్యాప్తంగా ఈ టీచర్ల నియామకానికి సంబంధించిన స్కాం కలకలం రేపింది. దేశంలోనే అతి పెత్త రిక్రూట్ మెంట్ కుంభకోణం అని గుర్తించారు.
ఈ కేసుకు సంబంధించి అప్పట్లో కోర్టు ఓం ప్రకాశ్ చౌతాలా(Om Prakash Chautala) తో పోటు ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మందికి షాక్ ఇచ్చింది.
వీరందరినీ దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. 2013లో ఈ కేసుకు సంబంధించి చౌతాలా అరెస్ట్ అయ్యారు.
ఇక 1999 నుంచి 2005 దాకా సీఎంగా పని చేసిన సమయంలో ఆయన ఫ్యామిలీ భారీ ఎత్తున బినామీల పేరుతో ఆస్తులు కూడబెట్టారని సీబీఐ అభియోగాలు మోపింది. ఛార్జిషీట్ దాఖలు చేసింది.
Also Read : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాలి