CR Paatil : 12న గుజ‌రాత్ లో బీజేపీ స‌ర్కార్ ఏర్పాటు

కొలువు తీర‌నున్న కొత్త ప్ర‌భుత్వం

CR Paatil : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్వంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్ లో ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు మించి సీట్లు రావ‌డం భార‌తీయ జ‌న‌తా పార్టీకి సంతోషాన్ని క‌లిగించింది. కానీ ఆ పార్టీకి కోలుకోలేని రీతిలో దెబ్బ త‌గిలింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో కాషాయానికి ఆశించినంత మేర మెజారిటీ రాలేదు.

ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం కొన‌సాగుతోంది. ఇక గుజ‌రాత్ రాష్ట్ర చ‌రిత్ర‌లో బీజేపీ అరుదైన ఘ‌న‌త సృష్టించింది. 1985 నుంచి వ‌రుస‌గా బీజేపీ అధికారంలో కొన‌సాగుతూ వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుసార్లు వ‌రుస‌గా గెలుస్తూ వ‌చ్చింది భార‌తీయ జ‌న‌తా పార్టీ.

ఇది వ‌రుస‌గా ఏడోసారి కావ‌డం..కొలువు తీరీడం. ఇందులో భాగంగా ఈనెల 12న కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు బీజేపీ రాష్ట్ర చీఫ్ సీఆర్ పాటిల్(CR Paatil). గురువారం ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆశించిన దానికంటే ఎక్కువ‌గా వ‌స్తుండ‌డంతో 158 సీట్ల‌లో బీజేపీ లీడ్ లో ఉండ‌డంతో ఇక స‌ర్కార్ ఏర్పాటు చేయ‌డ‌మే మిగిలి ఉంద‌న్నారు.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు 98 సీట్లు కావాల్సి ఉండ‌గా ఆ మ్యాజిక్ ను బీజేపీ ఎప్పుడో దాటేసింది. విచిత్రం ఏమిటంటే గ‌తంలో 2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కంటే అత్య‌ధిక సీట్ల‌ను గెలుచుకుంది బీజేపీ.

12న మధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని వెల్ల‌డించారు సీఆర్ పాటిల్. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. అమిత్ షా అన్నీ తానై వ్య‌వ‌హ‌రించ‌గా మోదీ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు.

Also Read : గుజ‌రాత్ లో క‌మ‌లం ప్ర‌భంజ‌నం

Leave A Reply

Your Email Id will not be published!