MLC Kavitha ED : 16న మ‌రోసారి క‌విత విచార‌ణ

నోటీసులు జారీ చేసిన ఈడీ

MLC Kavitha Case : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసుకు సంబంధించి శ‌నివారం 9 గంట‌ల పాటు విచార‌ణ చేప‌ట్టింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ. ఉద‌యం 11 గంట‌ల నుండి రాత్రి 8.05 గంటల‌ వ‌ర‌కు కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా మార్చి 16న విచార‌ణ‌కు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ మేర‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమెకు స్వ‌యంగా అంద‌జేసింది.

ఆఫీసు నుంచి నేరుగా తుగ్గ‌క్ రోడ్డు లోని సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు. సౌత్ గ్రూప్ ద్వారా రూ. 100 కోట్ల రూపాయ‌ల ముడుపుల‌ను ఆప్ కు ఇచ్చిన‌ట్లు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, హైద‌రాబాద్ వ్యాపార‌వేత్త అరుణ రామ‌చంద్ర పిళ్లై , మాజీ ఆడిట‌ర్ బుచ్చిబాబు, మాగుంట రాఘ‌వ రెడ్డిలు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా క‌విత‌ను ప్ర‌శ్నించింది ఈడీ టీం.

విచార‌ణ‌లో భాగంగా మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చారు. త‌న వ్య‌క్తిగ‌త ఫోన్ ను తీసుకు రావాల‌ని సూచించారు. ఆమె రిసెప్ష‌న్ కౌంట‌ర్ లో ఉంచిన దానిని తిరిగి తీసుకు వెళ్లారు.

కేసుకు సంబంధించి విచార‌ణ ఇంకా ముగియ లేద‌ని మ‌రోసారి రావాల్సిందిగా స్ప‌ష్టం చేసింది. ఈడీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌న‌కు సంబంధం ఏమీ లేదంటూ చెప్పిన‌ట్లు స‌మాచారం. అయితే విచార‌ణ పూర్త‌యిన వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎమ్మెల్సీ క‌విత(MLC Kavitha Case)  ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు.

ఆమె ముందు నుంచి చెబుతూ వ‌స్తున్నారు తాను ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు స‌హ‌క‌రిస్తాన‌ని. విచార‌ణ చేప‌డ‌తారా లేక దీనిని కూడా రాజ‌కీయంగా వాడుకుంటారా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : బండిపై మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!