JP Nadda : మునుగోడులో ఉప ఎన్నిక కీలకంగా మారింది. ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం ఊపందుకుంది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు.
మిగతా పార్టీలు పోటీలో ఉన్నా పోటీ మాత్రం త్రిముఖ మధ్యే కొనసాగుతోంది. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఆయా పార్టీలు పోటా పోటీగా ర్యాలీలు, యాత్రలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కుమార్ తో పాటు ఈటల రాజేందర్ , జితేందర్ రెడ్డి, డికే అరుణ, తదితర నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఎలాగైనా సరే బీజేపీ అభ్యర్థి గెలుపొందాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో డబ్బులు నీళ్లలాగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అక్టోబర్ 31న మునుగోడు నియోకజవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది.
రాష్ట్ర బీజేపీ వర్గాల సమాచారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని సమాచారం. ఇదిలా ఉండగా జేపీ నడ్డాకు బతికి ఉండగానే సమాధి చేశారు. ఆయన చిత్రాన్ని ఏర్పాటు చేశారు. రీజినల్ ఫ్లోరైడ్ మిటిగేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు జేపీ నడ్డా(JP Nadda). దీనిని విస్మరించడంపై నిరసిస్తూ ఏకంగా సమాధి కట్టారు.
Also Read : కోమటిరెడ్డికి షాక్ షోకాజ్ నోటీసు