Rahul Yatra Womens : 19న రాహుల్ యాత్రలో అంతా మహిళలే
దివంగత ఇందిరా గాంధీ జయంతి స్పెషల్
Rahul Yatra Womens : కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. నవంబర్ 19న భారత దేశ మాజీ ప్రధాన మంత్రి , దివంగత ఇందిరా గాంధీ జయంతి. పార్టీ పరంగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ మీడియా ఇంచార్జ్ జైరాం రమేష్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కేవలం మహిళలు(Rahul Yatra Womens) మాత్రమే పాల్గొంటారని తెలిపారు. చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు , వృద్దులు ఎవరైనా సరే స్వచ్చందంగా పాల్గొనవచ్చని సూచించారు.
ఆమెకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇందిర జయంతి రోజు మహిళలు మాత్రమే రాహుల్ గాంధీ వెంట నడుస్తారు. ఆ రోజంతా రాహుల్ గాంధీ అడుగులో అడుగు వేస్తారని తెలిపారు జైరాం రమేష్. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలోని అంకోలా జిల్లాలో కొనసాగుతోంది.
ఇప్పటి వరకు రాహుల్ పాదయాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పూర్తయింది. ఇదిలా ఉండగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు సినీ రంగానికి చెందిన పూనమ్ కౌర్ , పూజా భట్ పాల్గొనగా స్వర భాస్కర్ ట్విట్టర్ వేదికగా మద్దతు పలికారు.
గురువారం జరిగిన పాదయాత్రలో బాలీవుడ్ నటి రియా సేన్ రాహుల్ గాంధీకి బాసటగా నిలిచారు. ఆమె కూడా రాహుల్ వెంట నడిచారు.
Also Read : రాహుల్ యాత్రలో పాల్గొన్న రియా సేన్