CJI Chandrachud : ఒక‌ప్పుడు రేడియో జాకీగా ప‌ని చేశా – సీజేఐ

ఆ అనుభ‌వం ఇప్పుడు ప‌నికొస్తోంద‌న్న చంద్ర‌చూడ్

CJI Chandrachud : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్(CJI Chandrachud) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న జీవితంలో కొన్ని మ‌రిచి పోలేని జ్ఞాప‌కాలు కూడా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. తన లైఫ్ జెర్నీలో ఎక్కువ‌గా త‌న‌ను సంతోషానికి గురి చేసింది మాత్రం రేడియో జాకీగానేన‌ని తెలిపారు.

త‌న‌కు 20 ఏళ్ల స‌మ‌యంలో రేడియో జాకీగా ప‌ని చేశాన‌ని చెప్పారు. ప్లే ఇట్ కూల్ , డేట్ విత్ యు లేదా సండే రిక్వెస్ట్ వంటి పేర్ల‌తో కూడిన షోల‌ను తాను హోస్ట్ చేశాన‌ని వెల్ల‌డించారు చంద్ర‌చూడ్. త‌న‌కు పుస్త‌కాల‌న్నా, సంగీతం అన్నా చాలా ఇష్ట‌మ‌ని తెలిపారు

సంచ‌ల‌న తీర్పుల‌కు పెట్టింది పేరు సీజేఐ. ఆయ‌న బ‌య‌ట ఎంత ఉత్సాహంగా ఉంటారో కోర్టులో మాత్రం చాలా సీరియ‌స్ అయి పోతారు. అత్యంత ప్ర‌తిభాశాలిగా పేరొందారు. దేశ చ‌రిత్ర‌లో ఎన్నో విప్ల‌వాత్మ‌క‌మైన తీర్పుల‌ను ఇచ్చారు.

దేశంలోనే కాదు ప్ర‌పంచంలోనే టాప్ న్యాయ‌మూర్తుల‌లో ఒక‌రుగా గుర్తింపు పొందారు. సీజేఐ చంద్ర‌చూడ్ గోవాలోని న్యాయ విద్యార్థుల‌తో స‌ర‌దాగా కొద్ది సేపు ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్బంగా ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెప్పారు.

సంగీతం ప‌ట్ల నా ప్రేమ ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంద‌న్నారు. కోర్టులో లాయ‌ర్లు, న్యాయ‌వాదులు చెప్పిన వాటిని వింటాను. ఇది కూడా ఒక సంగీతంలో భాగమేన‌ని చ‌మ‌త్క‌రించారు జ‌స్టిస్ చంద్ర‌చూడ్(CJI Chandrachud). ఇంటికి వెళ్లాక తిరిగి సంగీతాన్ని వింటాన‌ని పేర్కొన్నారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చొర‌వ‌తో గోవాలోని ఇంటర్నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ లీగ‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ తొలి అక‌డ‌మిక్ సెష‌న్ ను చంద్ర‌చూడ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగిస్తూ విద్యార్థులు నిత్యం ప‌రిశోధ‌న చేస్తుండాల‌ని సూచించారు.

Also Read : రాహుల్ యాత్రపై క‌క్ష క‌ట్టిన మీడియా – గెహ్లాట్

Leave A Reply

Your Email Id will not be published!