Anil Vij : న‌మ్మ‌కం లేని వారే హిజాబ్ ధ‌రించ‌మంటారు

హ‌ర్యానా మంత్రి అనిల్ విజ్ షాకింగ్ కామెంట్స్

Anil Vij : హ‌ర్యానా రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇవాళ దేశ వ్యాప్తంగా మ‌రోసారి హిజాబ్ వివాదంపై చ‌ర్చ జ‌రుగుతోంది. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం హిజాబ్ ధ‌రించ‌డాన్ని నిషేధం విధించింది. దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు తుది తీర్పును వెలువ‌రించే బాధ్య‌త‌ను భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి వ‌దిలి వేశారు. మ‌రో వైపు క‌ర్ణాట‌క విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రైనా స‌రే విద్యా సంస్థ‌లలో చ‌దువుకునే వారు ప్ర‌భుత్వ రూల్స్ కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందేనంటూ పేర్కొన్నారు.

ఈ త‌రుణంలో ఇదే బీజేపీకి చెందిన హ‌ర్యానా రాష్ట్ర శాఖ మంత్రి అనిల్ విజ్(Anil Vij) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. స్వీయ నియంత్ర‌ణ లేని వాళ్లు, త‌మ మీద త‌మ‌కు న‌మ్మ‌కం లేని పురుషులు మాత్ర‌మే మ‌హిళ‌ల‌ను హిజాబ్ ధ‌రించమ‌ని బ‌ల‌వంతం చేస్తారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌స్తుతం అనిల్ విజ్ చేసిన ఈ కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు మంత్రి. ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడారు. పురుషులు త‌మ మ‌న‌స్సుల‌ను బ‌లోపేతం చేసుకోవాలి. మహిళ‌ల‌ను హిజాబ్ నుండి విముక్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది.

కోరిక‌ల‌ను అదుపు చేసుకోని వారే హిజాబ్ ధ‌రించ‌మంటూ బ‌ల‌వంతం చేస్తూ వ‌చ్చార‌ని ఆరోపించారు అనిల్ విజ్.

Also Read : మెరుగైన తీర్పును ఆశిస్తున్నాం – న‌గేష్

Leave A Reply

Your Email Id will not be published!