Telangana Secretariat : 30న సచివాలయానికి మోక్షం
ముహూర్తం ఖరారు చేసిన సీఎం
Telangana Secretariat : కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కట్టించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయం(Telangana Secretariat) ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. త్వరలోనే ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లాయి. ఇక బీఆర్ఎస్ మరోసారి పవర్ లోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. పాత సెక్రటేరియట్ ను కూల్చేసి పునర్ నిర్మించారు. భారీ ఎత్తున ఖర్చు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు నిలదీశాయి.
ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్డడం అవసరమా అన్న ప్రశ్నలు లేవనెత్తాయి. కానీ వాటిని ఏవీ పట్టించు కోలేదు సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు బీఆర్కే భవన్ వేదికగా రాష్ట్రానికి సంబంధించిన ఆయా శాఖల కార్యకలాపాలు కొనసాగాయి. ఇప్పటి నుంచి 28 దాకా ఫైళ్లు, ఇతర సామాగ్రిని కొత్త సచివాలయానికి చేరుస్తారు. ఇదిలా ఉండగా సీఎం ఫ్లోర్ల వారీగా ఆయా శాఖలను కూడా కేటాయించారు. ఇదే సమయంలో సచివాలయ ప్రాంగణంలో సుదర్శన యాగం కూడా చేపట్టనున్నట్లు సమాచారం.
ఇక కేటాయించిన శాఖల వారీగా చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ లో ఎస్సీ, మైనార్టీ, కార్మిక, రెవిన్యూ శాఖలు ఉంటాయి. 2వ ఫ్లోర్ లో ఆర్థిక, ఆరోగ్య, ఎనర్జీ, పశు సంవర్దక శాఖలు, 3వ ఫ్లోర్ లో పారిశ్రామిక, వాణిజ్య, ఎస్సీ , ప్లానింగ్ శాఖలు ఉంటాయి. 4వ అంతస్తులో బీసీ వెల్ఫేర్ , ఫారెస్ట్ , కల్చరల్ , నీటి పారుదల , లా అండ్ శాఖలు కేటాయించారు. ఇక 5వ ఫ్లోర్ లో టీఆర్ అండ్ బీ, ఇతర శాఖలు, 6వ అంతస్తులో సీఎం, సీఎస్ లకు ఉండేలా చేశారు.
Also Read : కొలువుల కోసం ఆగదు పోరాటం