Oppn Leaders : ప్రతిపక్షాల ర్యాలీలో ఐక్యతా రాగం
మోదీ బీజేపీ ప్రభుత్వంపై యుద్దం
Oppn Leaders : జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మోదీని, బీజేపీని ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నారని జేడీయూ నేత కేసీ త్యాగి వెల్లడించారు.
ఐటీ, సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ సంస్థలు ఎన్ని వచ్చినా అభ్యంతరం లేదన్నారు. ఆదివారం హర్యానా లోని ఫతేహాబాద్ లో నిర్వహించిన ఐఎన్ఎల్డీ మహా ర్యాలీ చేపట్టారు.
ఈ ర్యాలీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ , సీపీఎం అగ్ర నేత సీతారాం ఏచూరి, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ , ఐఎన్ఎల్డీ చీఫ్ ఓం ప్రకాష్ చౌతాలాతో సహా పలువురు అగ్ర నాయకులు తరలి వచ్చారు.
ర్యాలీని ఉద్దేశించి జేడీయూ నాయకుడు కేసీ త్యాగి ప్రసంగించారు. బీజేపీపై యుద్దం చేసేందుకు బీహార్ సీఎం పాట్నా నుండి ఇక్కడికి వచ్చారని అన్నారు.
నితీశ్ కుమార్ కు ఈడీ, ఆదాయ పన్ను , ఇతర ఏజెన్సీల భయం లేదన్నారు. తాను ప్రధానమంత్రి అభ్యర్థిని కాదని థర్డ్ ఫ్రంట్ అనే ప్రశ్న లేదని , కాంగ్రెస్ తో సహా ఒక ఫ్రంట్ ఉండాలన్నారు.
అప్పుడే 2024లో భారతీయ జనతా పార్టీని ఓడించ గలమన్నారు సీఎం నితీశ్ కుమార్. మాజీ ఉప ప్రధాన మంత్రి, ఐఎన్ఎల్డీ వ్యవస్థాపకుడు దేవీలాల్ జయంతి సందర్భంగా ర్యాలీ చేపట్టారు.
విపక్షాల ఐక్యతను చాటుతూ జరుగుతున్న ర్యాలీకి బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, శివసేన పార్టీకి చెందిన అరవింద్ సావంత్ హాజరయ్యారు(Oppn Leaders) .
ర్యాలీ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆర్జేడీ చీఫ్ , మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ , సీఎం నితీశ్ కుమార్ కలవనున్నారు.
Also Read : 21 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు