Sri Lanka Crisis : శ్రీలంకలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్షం ఓకే
ప్రకటించిన ప్రతిపక్ష నాయకుడు విమల్ వీరవాన్స
Sri Lanka Crisis : శ్రీలంకలో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో ఇప్పటికే దేశ అధ్యక్షుడు గోటబోయ రాజపక్సే దేశం విడిచి పారి పోయాడు.
మరోవైపు పీఎంగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రణిలె విక్రమ సింఘే తన ఇంటికి నిప్పు పెట్టడం, వాహనాలు ధ్వంసం చేయడంతో పీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఇదే సమయంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విపక్షాలను ఆహ్వానించాడు. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెంట్, పీఎం రాజీనామా చేస్తే వారి స్థానంలో స్పీకర్ దేశ అధ్యక్షుడిగా ఉంటారు.
30 రోజుల పాటు ఆయన ఈ స్థానంలో ఉంటారు. తాజాగా పీఎం విక్రమసింఘే చేసిన విజ్ఞప్తికి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి.
ఈ విషయాన్ని శ్రీలంక(Sri Lanka Crisis) పొదుజన పెరమున పార్టీ విడి పోయిన గ్రూపునకు చెందిన విమల్ వీరవాన్స చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు గోటబోయ రాజపక్సే బుధవారం రాజీనామా చేయనున్నట్లు పార్లమెంట్ స్పీకర్ తెలిపారు.
దీంతో ప్రతిపక్ష పార్టీలు సమావేశమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. ఊహించని రీతిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గోటబోయ రాజపక్సే, రణిలే విక్రమ సింఘే తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఆర్థిక సంక్షోభంలో కొట్టుకు పోతున్న దేశాన్ని రక్షించే బాధ్యత ఇప్పుడు కొత్తగా కొలువు తీరే ప్రతిపక్షాల ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. తాత్కాలిక ఏర్పాటుకు అంగీకరించామంటూ వీరవాన్స తెలిపారు.
ఇదిలా ఉండగా ఈనెల 13 వరకు వేచి చూడాల్సిన అవసరం లేదన్నాడు మరో నాయకుడు వాసుదేవ నానయక్కరా. తాము పరిమిత కాలానికి అన్ని పార్టీలతో కలిసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాం.
ఆపై పార్లమెంట్ ఎన్నికలకు వెళతామన్నారు స్జీబీ ప్రధాన కార్యదర్శి రంజిత్ మద్దుమ బండార చెప్పారు.
Also Read : భారత్ లో శ్రీలంక అధ్యక్షుడి సీన్