Opposition Meet : 26 పార్టీల‌తో మెగా కూటమి ఏర్పాటు

ఇండియాగా నామ క‌ర‌ణం

Opposition Meet : రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు 26 పార్టీల‌తో కూడిన మెగా కూట‌మిని ఏర్పాటు చేశారు. దేశంలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన నేత‌లు కీల‌క భేటీలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ఆహ్వానించ‌లేదు. ఇక హాజ‌రైన పార్టీల‌లో భార‌త జాతీయ కాంగ్రెస్(Congress) ఉంది. లోక్ స‌భ, రాజ్య‌స‌భ క‌లిపి 80 సీట్లు ఉన్నాయి. క‌ర్ణాట‌క‌, రాజ‌స్థాన్ , ఛ‌త్తీస్ గఢ్ , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ల‌లో ప‌వ‌ర్ లో ఉంది. ఇక బీహార్ , త‌మిళ‌నాడు, జార్ఖండ్ ల‌లో భాగ‌స్వామిగా ఉంది.

Opposition Meet Continues

టీఎంసీకి 35 మంది ఎంపీలు ఉన్నారు. డీఎంకే 34 మంది ఎంపీల బ‌ల‌గం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 11 మంది స‌భ్యుల‌ను క‌లిగి ఉంది. జేడీయూ 21 మంది , రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ ఆరుగురు ఎంపీలు ఉన్నారు. జార్ఖండ్ ముక్తీ మోర్చా పార్టీ త‌ర‌పున ముగ్గురు ఎంపీలు ఉన్నారు.

శ‌ర‌ద్ ప‌వార్ స్థాపించిన ఎన్సీపీ కూడా హాజ‌రైంది. శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ కూడా పాల్గొంది. స‌మాజ్ వాది పార్టీకి ఏడుగురు ఎంపీలు ఉన్నారు. రాష్ట్రీయ లోక్ ద‌ళ్ , అప్నా ద‌ళ్ , జ‌మ్మూ కాశ్మీర్ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ , పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీ, సీపీఐ , సీపీఎం పార్టీలు కూడా పాల్గొన్నాయి. సీపీఐ ఎంఎల్ , రివ‌ల్యూష‌న‌రీ సోష‌లిస్ట్ పార్టీ , ఆల్ ఇండియా ఫార్వ‌ర్డ్ బ్లాక్ , మరుమ‌లార్చి ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం (ఎండీఎంకే) , విడుత‌లై చిరుతైగ‌ల్ క‌ట్చి , కొంగునాడు మ‌క్క‌ల్ దేశియో క‌ట్చి, మ‌నితానేయ మ‌క్క‌ల్ క‌ట్చి , ఇండియ‌న్ యూనియ‌న్ ముస్లిం లీగ్ , కేర‌ళ కాంగ్రెస్ పార్టీల నేతలు పాల్గొన్నారు.

Also Read : Hemant Soren : మోదీ పాల‌నపై యుద్దం – హేమంత్ సోరేన్

Leave A Reply

Your Email Id will not be published!