Opposition Meet : విపక్షాల కీలక భేటీ బెంగళూరు వేదికగా కొనసాగుతోంది. ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే , సీఎంలు మమతా బెనర్జీ , ఎంకే స్టాలిన్ , నితీశ్ కుమార్ , ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. ఐక్య ఫ్రంట్ కు కన్వీనర్ గా ఎవరు ఉండాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
Opposition Meet at Bengaluru
ఇవాళ కాంగ్రెస్(Congress) పార్టీకి పెద్ద నష్టం సమకూరింది. ఆ పార్టీకి చెందిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కేరళకు చెందిన మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్ను మూశారు. ఈ సందర్భంగా మౌనం పాటించారు. అంతకు ముందు సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చాలా సేపు చర్చించారు. ఇద్దరి మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
అంతకు ముందు విపక్ష పార్టీలన్నీ జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలో పాట్నాలో తొలి సమావేశం జరిగింది. రెండో సమావేశం సిమ్లాలో నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాల రీత్యా బెంగళూరుకు మార్చారు. ఇక్కడ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ కీలక భేటీకి హాజరు కావడం విశేషం. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బదులు ఎంపీ రాఘవ్ చద్దా హాజరయ్యారు.
Also Read : Revanth Reddy : 24 గంటలలోపు క్షమాపణ చెప్పాలి
