Opposition Parties Meeting : విపక్షాల కూటమి కీలక సమావేశం
రెండు రోజుల పాటు భేటీ
Opposition Parties Meeting : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ నేతృత్వంలోని 24 పార్టీలు సమావేశం కానున్నాయి బెంగళూరులో. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్(Congress) పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది. మొత్తం ఏర్పాట్లను ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరు హాజరు కావాలంటూ ఇప్పటికే ఆహ్వానం పంపించింది ఏఐసీసీ.
కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వచ్చే 2024లో కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్. బీహార్ రాజధాని పాట్నాలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పీడీఎఫ్ గా నామకరణం కూడా చేశారు. బెంగళూరు వేదికగా ఇవాళ పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ చేసేందుకు ప్లాన్ చేశారు.
సీట్ల షేరింగ్ తో పాటు విపక్షాల కూటమికి ఎవరు నాయకత్వం వహించాలనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ జరిగే ఈ కీలక భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆయా పార్టీలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆయా పార్టీలకు సంబంధించిన చీఫ్ లకు సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ విందు ఇచ్చారు. మరో వైపు ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందా రాదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.
Also Read : Suriya Viral : సూర్య పాపులర్ నెట్టింట్లో వైరల్
