Opposition Partys : సెంథిల్ అరెస్ట్ పై విప‌క్షాలు గుస్సా

ఇది పూర్తిగా క‌క్ష సాధింపు చ‌ర్యే

Opposition Partys : త‌మిళ‌నాడు డీఎంకే విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని బుధ‌వారం తెల్ల వారుజామున కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేసింది. 18 గంట‌ల పాటు సోదాలు చేప‌ట్టింది. ఇదే స‌మ‌యంలో సెంథిల్ ప‌ట్ల ఈడీ ఆఫీస‌ర్లు దురుసుగా ప్ర‌వ‌ర్తించారంటూ డీఎంకే ఆరోపించింది. ఇదే స‌మ‌యంలో మంత్రికి ఛాతిలో నొప్పి రావ‌డంతో హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం ఎంకే స్టాలిన్ . ఇది పూర్తిగా క‌క్ష సాధింపు త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. తాము కోర్టులో తేల్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా దేశంలోని ప్ర‌తిపక్ష పార్టీల నేత‌లు మండిప‌డ్డారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ కావాల‌ని వేధింపుల‌కు పాల్ప‌డుతోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆప్ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) , మాజీ సీఎం ఒబ‌ర్ అబ్దుల్లా, సీపీఐకి చెందిన డి. రాజా మంత్రి సెంథిట్ బాలాజీని అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

జాబ్స్ స్కాంకు సంబంధించి మ‌నీ లాండ‌రింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న‌ట్లు ఈడీ ప్ర‌క‌టించింది. గ‌తంలో అన్నాడీఎంకే హ‌యాంలో సెంథిల్ బాలాజీ మంత్రిగా ప‌ని చేశారు. ఆనాడు ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. తాజాగా ప్ర‌స్తుతం డీఎంకే హ‌యాంలో సైతం మంత్రి గా ఉన్నారు. ఇవాళ సెంథిల్ ను అదుపులోకి తీసుకోవ‌డంతో త‌మిళ‌నాడులో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

Also Read : CM KCR : వైద్య రంగానికి అధిక ప్రాధాన్య‌త

Leave A Reply

Your Email Id will not be published!