Bhagwant Mann : గ్యాంగ్ స్ట‌ర్ ల‌ను ప్రోత్స‌హిస్తున్న ప్ర‌తిప‌క్షాలు

నిప్పులు చెరిగిన పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్

Bhagwant Mann :  పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌తిప‌క్ష పార్టీలను టార్గెట్ చేశారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలో తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక నేరాల‌ను అదుపులోకి తీసుకు వ‌చ్చామ‌న్నారు. గ‌తంలో రాష్ట్రాన్ని ఏలిన పాల‌కులు నేర సంస్కృతిని పెంచి పోషించాయంటూ ఆరోపించారు సీఎం.

ప్ర‌ధానంగా కాంగ్రెస్, అకాలీద‌ళ్ కావాల‌ని ప్రోత్స‌హిస్తున్నాయంటూ మండిప‌డ్డారు. కానీ తాను ముఖ్య‌మంత్రిగా కొలువు తీరాక ప్ర‌ధానంగా నేరాల అదుపుపై ఫోక‌స్ పెట్టాన‌ని చెప్పారు. అసెంబ్లీ ముగింపు స‌మావేశంలో స‌భ‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌సంగం చేశారు భ‌గవంత్ మాన్.

ప్ర‌ముఖ సింగ‌ర్ సిద్దూ మూసే వాలా హ‌త్య కేసులో నిందితుడు త‌ప్పించు కోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాయి. ఇది ముమ్మాటికీ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మ‌ని, పోలీసుల నిర్లక్ష్యం అంటూ మండిప‌డ్డాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann). ఇప్ప‌టికే త‌ప్పించుకున్న కీల‌క నిందితుడిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేశామ‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు కేసుకు సంబంధించి 36 మందిపై కేసు న‌మోదైంద‌ని 28 మందిని అరెస్ట్ చేశామ‌ని చెప్పారు భ‌గ‌వంత్ మాన్. త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసమే గ్యాంగ్ స్ట‌ర్ ల‌ను పెంచి పోషించాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం. తాము వ‌చ్చిన ఈ ఆరు నెల్లో గూండాలు ఎక్క‌డా పుట్ట‌లేద‌న్నారు.

జీరో అవ‌ర్ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నాయ‌కుడు ప‌ర్తాప్ సింగ్ బ‌జ్వా గ్యాంగ్ స్ట‌ర్ త‌ప్పించు కోవ‌డంపై ఆప్ స‌ర్కార్ ని నిందించారు. బార్ గారీ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వారికి క‌ఠిన శిక్ష‌లు ప‌డేలా త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు భ‌గ‌వంత్ మాన్.

Also Read : సిద్దూ హ‌త్య కేసులో లుక్ అవుట్ నోటీసు

Leave A Reply

Your Email Id will not be published!