ops: పాత పెన్షన విధానం అమలు చేయాలి
పాత పెన్షన విధానం అమలు చేయాలి
ops: గత ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు రూపొందించకుండా జీవో 54 ప్రకారం జీపీఎస్ అమలు చేస్తూ నిన్నటి రోజున విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషనను రద్దు చేయాలని యూటీఎఫ్ పలు జిల్లాలా ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు..
ops…
జీపీఎస్ ప్రతులను దహనం చేస్తున్న యూటీఎఫ్ నేతలు..
డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆందోళనలు..
గత ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు రూపొందించకుండా జీవో 54 ప్రకారం జీపీఎస్ అమలు చేస్తూ నిన్నటి రోజున విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషనను రద్దు చేయాలని యూటీఎఫ్ పలు జిల్లాలా ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. జీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో శనివారం సాయంత్రం యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద గెజిట్ నోటిపికేషన ప్రతులను దహనం చేస్తూ నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన రోజున వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగనమోహనరెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసి జీపీఎస్ అనే దిక్కుమాలిన విధానాన్ని తీసుకొచ్చారని విమర్శించారు.
నూతన ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఉన్న సందర్భంలో ఈ నోటిఫికేషన రావడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు షాక్‌కు గురయ్యారని, వెంటనే ఈ నోటిఫికేసన రద్దు చేసి పాత పెన్షన విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం వెంటనే పాత పెన్షన అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : Puri Ratna Bhandar : పూరి జగన్నాథుని రత్న భాండాగారాన్ని తెరిచిన బీజేపీ సర్కార్