RGV Vyuham : ఆర్జీవీ ‘వ్యూహం’పై ఉత్కంఠ
సీఎం జగన్ జీవిత కథ
RGV Vyuham : రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అత్యంత జనాదరణ , వివాదాస్పద దర్శకుడిగా పేరు పొందారు. ముంబై మాఫియా రాజ్యాం ఏలుతున్న తరుణంలో అండర్ డాన్ ల గురించి ధైర్యంగా సెల్యూలాయిడ్ మీద తెరకెక్కించిన ఘనత ఆర్జీవీది. ఆయన ఫ్యాక్టరీలోంచి వచ్చిన వాళ్లు నటీ నటులుగా , టెక్నీషియన్లుగా, దర్శకులుగా బయటకు వచ్చారు. అలాంటి వాళ్లకు కొదువ లేదు. ఆర్జీవీ అంటేనే ఓ బ్రాండ్. తెలుగు సినిమా రంగంలో ఆయన తీసిన శివ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగానే ఉండి పోయింది.
సినిమా రంగానికి సంబంధించి 24 ఫ్రేమ్స్ గురించి చెప్పే కొద్దిమంది దర్శకులలో రామ్ గోపాల్ వర్మ(RGV) ఒకడు . ఆయాన్ రాండ్ , ఫ్రెడరిక్ నీషే, కాఫ్కా లాంటి రచనలను ఎక్కువగా ఇష్టపడే వర్మ టేకింగ్ అద్బుతంగా ఉంటుంది. ఆయన శిష్యులలో పేరొందిన దర్శకులు పూరీ జగన్నాథ్ , ముప్పలేని శివ, కృష్ణ వంశీ ఉన్నారు. చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దగానే ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఆర్జీవీ అంటే కొందరికి కోపం. మరికొందరికి ఇష్టం. ఆయన చెప్పే ఫిలాసఫీ కొంత భిన్నంగా ఉంటుంది. అందుకే వర్మ అంటే చాలా మందికి మంట.
నిత్యం వార్తల్లో ఉండడం, హాట్ టాపిక్ గా మారడం ఆర్జీవీకి ఇష్టం. తాజాగా ఏపీ సీఎం జగన్ రెడ్డి జీవిత కథను తెరకెక్కించాడు. అదే వ్యూహం పేరుతో టీజర్ రిలీజ్ చేశాడు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
Also Read : Project K Movie : రూ. 600 కోట్లతో ప్రాజెక్టు కె మూవీ