Owaisi Modi : మోదీజీ సుప్రీం తీర్పుపై ఏమంటారు
నిప్పులు చెరిగిన ఎంఐఎం చీఫ్ ఓవైసీ
Owaisi Modi : ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Owaisi Modi) సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు.
ఈ సందర్భంగా జాతీయ మీడియాతో ఓవైసీ శుక్రవారం మాట్లాడారు. ఆమెపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారే తప్పా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదన్నారు.
2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల ఘటనలో సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా రావడంతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న బీజేపీ, ప్రధాని, మోదీ అమిత్ షా ఇప్పుడు భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఏమంటారని ఓవైసీ ప్రశ్నించారు.
ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని , చట్టం తన పని తాను చేసుకోవ్వాలని ప్రధానిని కోరారు. ఇంత జరిగినా బీజేపీ ఎందుకు కాపాడుతోందంటూ ప్రశ్నించారు ఓవైసీ. ఆమెపై కోర్టు ఏం చెప్పిందో కూడా జనాలకు చెప్పాలన్నారు.
ప్రవక్త మహమ్మద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. అంతే కాదు బేషరత్తుగా దేశానికి క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది.
అధికారంలో ఉన్నాం కదా అని, పార్టీకి సంబంధించి స్పోక్స్ పర్సన్ అయినంత మాత్రాన చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడాలని ఉందా అని జస్టిస్ సూర్యకాంత్ నిప్పులు చెరిగారు.
నూపుర్ శర్మ కామెంట్స్ చేయడమే కాకుండా తాను లాయర్ నని చెప్పుకోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఇవాళ దేశం తగలబడి పోవడానికి కారణం ఆమె చేసిన కామెంట్సేనని సీరియస్ అయ్యారు.
ఆపై రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ దారుణ హత్యకు నూపుర్ శర్మ (Nupur Sharma) చేసిన వ్యాఖ్యలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : యుద్దం ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదు
We demand to PM Modi that Nupur Sharma must be arrested, and let the law takes its own course. Why is BJP protecting her? BJP took credit for Gujarat clean chit by the SC, now they must look into what SC said about Nupur Sharma as well: AIMIM chief Asaduddin Owaisi pic.twitter.com/MdZeKVoPUx
— ANI (@ANI) July 1, 2022