P Chidambaram : విచారణ పేరుతో కక్ష సాధింపు
కేంద్ర సర్కార్ పై పి. చిదంబరం
P Chidambaram : నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ముందు హాజరయ్యారు. ఆమె మధ్యాహ్నం వెళ్లారు. సోనియా వెంట కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ ఉన్నారు.
ఇదే కేసుకు సంబంధించి రాహుల్ గాంధీని ఐదు రోజుల పాటు 10 నుంచి 12 గంటల దాకా విచారణ చేపట్టింది ఈడీ. కానీ ఎక్కడా తొట్రుపాటుకు గురి కాలేదు రాహుల్ గాంధీ. ఇదే విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ తరుణంలో సోనియా గాంధీని ఇవాళ విచారించిన ఈడీ కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే ప్రశ్నలు కురిపించింది. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి. చిదంబరం(P Chidambaram) .
విచారణ పేరుతో , ఎలాంటి ఆధారాలు లేకుండానే కేంద్ర దర్యాప్తు సంస్థ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. కేంద్ర సర్కార్ కావాలని చేస్తున్న నాటకంగా ఆయన అభివర్ణించారు.
ఎప్పుడో కొట్టి వేసిన కేసును తిరిగి ఎలా తెరుస్తారంటూ ప్రశ్నించారు. ఈ దేశంలో సుప్రీంకోర్టుకు మాత్రమే ప్రశ్నించే హక్కు ఉందని పేర్కొన్నారు. ఈడీ ఎక్కువ కాదని పేర్కొన్నారు.
కానీ ఏకపక్షంగా వ్యవహరించడం తగదన్నారు. బీజేపీ యేతర రాష్ట్రాలు, వ్యక్తులు, సంస్థలు, పార్టీలను టార్గెట్ గా పెట్టుకుని వ్యవహరించడం తప్ప మరొకటి కాదన్నారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పి. చిదంబరం పేర్కొన్నారు. సీనియర్ నాయకులు, పార్టీ బాధ్యులు సోనియా గాంధీని(Sonia Gandhi)కలుసుకునేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు.
Also Read : సీఎం సింగపూర్ టూర్ కు ఎల్జీ అడ్డంకి
The ED had no more questions after 3 pm. Despite Mrs Sonia Gandhi offering to continue to be available for questioning, the ED concluded the questioning today.
We were allowed to leave the Kingsway Camp police lines at 4 pm.
On my way home.
— P. Chidambaram (@PChidambaram_IN) July 21, 2022