P Chidambaram : కిర‌ణ్ రిజిజు రాజ్యాంగం చ‌దువుకో

ల‌క్ష్మ‌ణ రేఖ వ్యాఖ్య‌ల‌పై ఫైర్

P Chidambaram : దేశ వ్యాప్తంగా రాజ ద్రోహం కేసుపై సుప్రీంకోర్టు స్టే విధించ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. మేధావులు, బుద్ది జీవులు, ప్ర‌జాస్వామిక వాదులు, ప్ర‌తిప‌క్షాలు, జ‌ర్న‌లిస్టులు సుప్రీం చేసిన వ్యాఖ్య‌ల‌ను స్వాగతించారు.

అయితే కేంద్ర న్యాయ శాఖ మంత్రి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చేసిన ల‌క్ష్మ‌ణ రేఖ కామెంట్స్ ను తిరిగి ఆయ‌న‌కే తెలియ చేసేలా కామెంట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం రాజ ద్రోహం చ‌ట్టంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

దేశానికి 75 ఏళ్ల‌యింది స్వాతంత్రం వ‌చ్చి. ఇంకా ఈ చ‌ట్టం ఎందుకు అమ‌లు చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు. స‌త్యాన్ని ప‌ల‌క‌డం, ధ‌ర్మాన్ని ఆచ‌రించ‌డం నేరం ఎలా అవుతుంద‌ని నిల‌దీశారు.

రాజ ద్రోహం చ‌ట్టం పేరుతో అమాయ‌కుల‌ను, త‌మ‌కు పొస‌గ‌ని వాళ్ల‌ను, గిట్ట‌ని వాళ్ల‌ను టార్గెట్ గా చేస్తూ కేసులు న‌మోదు చేస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంద‌ని వ్యాఖ్యానించింది ధ‌ర్మాస‌నం.

కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన అఫిడవిట్ సంతృప్తిక‌రంగా లేదంటూ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కామెంట్ చేశారు. ఇదే స‌మ‌యంలో విప‌క్షాలు కోర్టు నిర్ణ‌యాన్ని స్వాగ‌తించాయి. కానీ కేంద్ర మంత్రి మాట‌ల్ని త‌ప్పు ప‌ట్టాయి.

ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి . చిదంబ‌రం(P Chidambaram) సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టుకు ల‌క్ష్మ‌ణ రేఖ గీసే ప‌వ‌ర్ కేంద్రానికి లేద‌న్నారు. భార‌త రాజ్యాంగాన్ని పూర్తిగా చ‌దివిన‌ట్టుగా లేద‌ని మండిప‌డ్డారు.

ఇదే స‌మ‌యంలో మంత్రి 13వ సెక్ష‌న్ ను చ‌దువు కోవాల‌ని హిత‌వు ప‌లికారు. ప్రాథ‌మిక హ‌క్కుల్ని హ‌రించేలా ప్ర‌భుత్వాలు చ‌ట్టాలు చేయ‌లేవ‌న్న సంగ‌తి గుర్తుంచు కోవాల‌న్నారు(P Chidambaram).

 

Also Read : రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్

Leave A Reply

Your Email Id will not be published!