P Chidambaram : వ్య‌క్తిగ‌త పొదుపు సామాజిక భ‌ద్ర‌త

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబ‌రం

P Chidambaram : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబ‌రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన బ‌డ్జెట్ వ‌ల్ల ఎవ‌రికీ లాభం లేద‌న్నారు. దేశ అభివృద్దికి ఉప‌యోగ‌ప‌డేలా లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి కావాల్సిన కొంద‌రికి మాత్ర‌మే ఉప‌యోగ ప‌డేలా ఉంద‌ని నిప్పులు చెరిగారు పి. చిదంబ‌రం(P Chidambaram). అదానీ గ్రూప్ వ‌ల్ల దేశానికి ఎలాంటి లాభం లేద‌న్నారు. పాత ప‌న్ను విధానంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ప‌న్ను చెల్లించే పౌరులు చార్ట‌ర్ట్ అకౌంటెంట్ ను సంప్ర‌దించాల‌ని కేంద్ర మాజీ మంత్రి సూచించారు. ఒక ర‌కంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ను ఎద్దేవా చేశారు. పాత‌, కొత్త ప‌న్ను విధానాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. గురువారం పి. చిదంబ‌రం మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్ర‌జ‌లు భ‌ద్ర‌త‌ను కోరుకుంటార‌ని వ్యాపార‌వేత్త‌ల‌ను కోరుకోరంటూ పేర్కొన్నారు.

వ్య‌క్తిగ‌త పొదుపు మాత్ర‌మే సామాజిక భ‌ద్ర‌తను క‌లుగ చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర మాజీ మంత్రి నొక్కి చెప్పారు. కొత్త ప‌న్ను విధానం ర‌హ‌స్యం ఛేదిస్తోంద‌న్నారు. మీరు ప‌న్ను చెల్లింపుదారులైతే తీర్మానాల‌కు తొంద‌ర ప‌డ‌కండి అని సూచించారు. కేంద్ర బ‌డ్జెట్ చాలా మంది భార‌తీయుల ఆశ‌ల‌ను చిదిమి వేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు పి. చిదంబ‌రం(P Chidambaram).

ధ‌నికులు, పేద‌ల మ‌ధ్య ఇంకా అస‌మాన‌త‌లు ఉండేలా బ‌డ్జెట్ చేసింద‌న్నారు. నిరుద్యోగం, ద్ర‌వ్యోల్బ‌ణం దేశాన్ని ప్ర‌భావం చేస్తుంటే వాటి గురించి ప్ర‌స్తావ‌నే లేద‌న్నారు.

Also Read : కొంద‌రి కోసం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్

Leave A Reply

Your Email Id will not be published!