P Chidambaram : సుప్రీం తీర్పు కేంద్రానికి చెంపపెట్టు
జస్టిస్ బీవీ నాగరత్నకు హ్యాట్సాఫ్
P Chidambaram : నోట్ల రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఇందులో నలుగురు మోదీ ప్రభుత్వానికి వత్తాసు పలికితే ఒకే ఒక్కరు జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం భిన్నమైన తీర్పు వెలువరించారు.
ఆమె ఏకంగా సంచలన కామెంట్స్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి మోదీని, ఆయన సర్కార్ ను ఏకి పారేశారు. ఇది పూర్తిగా చట్ట విరుద్దమని కుండ బద్దలు కొట్టారు. దేశానికి సంబంధించిన అంశం ఇది. దీని గురించి ఇంకా చర్చించాల్సి రావడం బాధాకరం.
అయినప్పటికీ తాను నోట్ల రద్దును పూర్తిగా చట్ట విరుద్దమేనని నమ్ముతున్నానని స్పష్టం చేశారు జస్టిస్ నాగరత్న. అయితే మెజారిటీ వైపు న్యాయమూర్తులు ఉన్నారు. వాళ్లు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కానీ ఎందుకు సమర్థిస్తున్నారో మాత్రం చెప్పలేక పోయారు. నోట్ల రద్దు విషయాన్ని ప్రధానమంత్రి ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
దీని గురించి పార్లమెంట్ లో జరగకుండానే ప్రకటించారు. దేశానికి సంబంధించి ఏ అంశంమైనా లేదా ఏ చట్టమైనా ముందు చర్చకు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం(P Chidambaram).
మెజారిటీ తీర్పు మోదీకి అనుకూలమైనప్పటికీ మైనార్టీ తీర్పు మాత్రం ఆయన సర్కార్ కు ఓ చెంపపెట్టు లాంటిదని అన్నారు. ఏది ఏమైనా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు కేంద్ర మాజీ మంత్రి.
Also Read : నోట్ల రద్దుపై మోడీ క్షమాపణలు చెప్పాలి