P Chidambaram : మోదీ వల్లనే చైనా చొరబాటు
మాజీ మంత్రి పి. చిదంబరం
P Chidambaram : హైదరాబాద్ – మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపూర్ , జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కు రాలేదని ఆరోపించారు.
బాధ్యత కలిగిన ప్రధాన మంత్రి పదవిలో ఉన్న నరేంద్ర మోదీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆయన అనుసరిస్తున్న మౌనం, తీసుకుంటున్న నిర్ణయాలు ఏవీ భారత్ ను రక్షించ లేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పి. చిదంబరం.
P Chidambaram Slams PM Modi
భారత దేశ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందన్నారు. దీనిని నియంత్రించేందుకు భారత్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. అసలు ఈ దేశంలో మోదీ అనే వ్యక్తి ఉన్నాడా అన్న అనుమానం తనకు కలుగుతోందన్నారు. వివిధ స్థాయిలలో చర్చలు జరిగినా చైనా ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
స్టేటస్ కో అనే మాటలు ఏమై పోయాయని మండిపడ్డారు. దీనికి విరుద్దంగా ప్రతి రజోఊ స్థితి మారుతోందని మండిపడ్డారు పి. చిదంబరం(P Chidambaram). రోజు రోజుకు భారత్ తన విలువైన భూ భాగాన్ని కోల్పోతూ వస్తోందన్నారు. మరో వైపు చైనా తన వైఖరిని మార్చు కోవడం లేదని దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
Also Read : CWC : రాబోయే ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్