Padi Kaushik reddy : గెలిపిస్తే జైత్ర యాత్ర లేదంటే శవయాత్ర
బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి
Padi Kaushik reddy : హుజూరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా తనను గెలిపిస్తే జైత్ర యాత్ర చేపడతానని లేక ఓడిస్తే శవ యాత్ర చూస్తారంటూ పేర్కొన్నారు.
Padi Kaushik reddy Comments Viral
మీరు ఓటు వేసి దీవించాలని కోరారు. 4వ తేదీన జైత్ర యాత్ర నిర్వహిస్తానని అన్నారు. మీరు గెలిపించక పోతే తమ కుటుంబ సభ్యుల శవ యాత్రకు మీరు రావాలని అన్నారు. తమ కుటుంబంలోని ముగ్గురం ఆత్మహత్యకు పాల్పడతామని ప్రకటించారు.
దీంతో పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik reddy) చేసిన తాజా కామెంట్స్ పై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు మరీ ఇంతలా దిగజారి మాట్లాడటం పై మండి పడుతున్నారు. ఒక రకంగా ఎమోషన ల్ గా బ్లాక్ మెయిల్ చేసినట్టేనని, ఇది పూర్తిగా ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్దమేనని పేర్కొంటున్నారు.
ఇప్పటికే తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యతిరేకంగా రాళ్లు వేసిన వ్యక్తిగా పేరుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ అండ చూసుకుని గవర్నర్ మహిళ అన్న సోయి లేకుండా అనరాని మాటలు అన్నారు కౌశిక్ రెడ్డి. జనం తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
Also Read : G kishan Reddy : హైదరాబాద్ పేరు మారుస్తాం