Mulayam Padma Vibhushan : ములాయంకు అరుదైన గౌరవం
మరణాంతరం పద్మ విభూషణ్
Mulayam Padma Vibhushan : భారత దేశ రాజకీయాలలో కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం , దివంగత ములాయం సింగ్ యాదవ్ . ఆయనకు మరణాంతరం కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైన పద్మ విభూషణ్ ను ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ములాయం చెరపలేని పేరు. ఆయనను అక్కడి ప్రజలంతా నేతాజీ అని పిలుచుకుంటారు.
దేశ వ్యాప్తంగా చూస్తే రెండవ అత్యున్నత అవార్డుకు ఎంపికయ్యారు. ప్రజా వ్యవహారాల రంగంలో ములాయం సింగ్ చేసిన సేవలకు గుర్తింపు గా ఈ పురస్కారానికి(Mulayam Padma Vibhushan) ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది. సమాజ్ వాది పార్టీని స్థాపించి కొన్నేళ్ల పాటు యూపీలో కొలువు తీరారు. సోషలిస్టు నాయకుడిగా పేరొందారు.
ఎస్పీ కుల పెద్దగా భావిస్తారు. 82 ఏళ్ల వయస్సులో గత ఏడాది 2022 అక్టోబర్ 10న కన్నుమూశారు ములాయం సింగ్ యాదవ్. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ పద్మ అవార్డులను ప్రకటించింది. ఆరుగురికి పద్మ విభూషణ్ , తొమ్మిది మందికి పద్మ భూషణ్ , 91 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి.
ఇదిలా ఉండగా ములాయం సింగ్ యాదవ్ మూడు సార్లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. 1989, 1993, 2003 రాష్ట్రంలో సోషలిస్ట్ గా, సెక్యులరిస్ట్ గా విస్తృతంగా గుర్తింపు పొందారు. ఆయన ఏడుసార్లు లోక్ సభ ఎంపీగా , 10 సార్లు ఎమ్మెల్యేగా , యుపీఏ సర్కార్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. 1967లో 27 ఏళ్ల వయస్సులో జస్వంత్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Also Read : ఈ పురస్కారం తండ్రికి అంకితం