PAK Army Chief : ఇమ్రాన్ మద్దతుదారులకు వార్నింగ్
ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్
PAK Army Chief : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇమ్రాన్ అరెస్ట్ తర్వాత దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ వరుస ఘటనలతో దాదాపు 8 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఇస్లామాబాద్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ కు రెండు వారాల పాటు బెయిల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిని ఖాకీలు ముట్టడించారని , తనను రేపో మాపో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ పేర్కొన్నాడు. జాతిని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఈ కీలక వ్యాఖ్యలు చేయడంతో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ గురువారం మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా ఎవరైనా నిరసన తెలియ చేయవచ్చని కానీ కావాలని హింసకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వాళ్లు ఎవరో పట్టుకుని తీరుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్.
Also Read : Sonia Gandhi DK Shiva Kumar