Pak Jaish Terrorist : కుల్గామ్ లో పాక్ జైష్ ఉగ్రవాది హతం
జైషే సంస్థకు కోలుకోలేని దెబ్బ
Pak Jaish Terrorist : భారత దేశంలో ఉగ్రవాదానికి ఊతం ఇస్తూ అల్లకల్లోలం సృష్టించేందుకు ప్లాన్ చేస్తూ హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు చెందిన ఉగ్రమూక సంస్థ జైష్ మహ్మద్ సంస్థకు చెందిన కరడు గట్టిన ఉగ్రవాది(Pak Jaish Terrorist) హతమయ్యాడు. భారత్ కు చెందిన భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
దక్షిణ కాశ్మీర్ లోని కుల్గామ్ 2019 పుల్వామా ఉగ్ర దాడికి ముందు కూడా జైషే మహ్మద్ టెర్రరిజానికి కేంద్రంగా ఉంది. పాకిస్తాన్ ఆధారిత నిషేధిత సంస్థ జైషే మహ్మద్ కి నియంత్రణ రేఖ వెంట సియాల్ కోట్ లో స్థావరం ఉంది. జమ్మూ దక్షిణ కాశ్మీర్ లో చర్య కోసం జిహాదీలను చొరబాటుకు పీర్ పంజాల్ కు దక్షిణంగా సరిహద్దును ఉపయోగిస్తూ వస్తోంది.
హతమైన ఉగ్రవాది నుంచి భద్రతా బలగాలు ఏకే 56 రైఫిల్ తో పాటు పిస్టల్ , కొన్ని మ్యాగజైన్ లను స్వాధీనం చేసుకున్నాయి. కుల్గాం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన భద్రతా దళాల దాడుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది ఎన్ కౌంటర్ అయ్యాడు. ఎ- కేటగిరీఈ జైషే మహ్మద్ ఉగ్రవాది అబూ హుర్రా పాకిస్తాన్ నివాసి.
హతమైన ఉగ్రవాది నుంచి భద్రతా దళాలు ఒక ఏకే 56 రైఫిల్ , ఒక పిస్టల్ , మూడు గ్రెనేడ్లు, నాలుగు మ్యాగజైన్లు, ఒక పిస్టల్ మ్యాగజైన్ ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్ ను నిర్దిష్ట నిఘా ఆధారంగా జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ , 15 కార్ప్స్ కమాండర్ ల సమన్వయంతో నిర్వహించారు.
ఇక జైష్ టెర్రర్ గ్రూప్ ను బహవల్ పూర్ లో ఉన్న అనారోగ్యంతో బాధ పడుతున్న మౌలానా మసూద్ అజర్ తమ్ముడు రౌఫ్ అజార్ సమర్థవంతంగా నడుపుతున్నాడు.
Also Read : భారత్..పాక్ ల మధ్య బంధం అవసరం