Imran Khan Pak Army : ఖాన్ క‌వ‌రేజీపై ఉక్కుపాదం

ఆదేశించిన పాకిస్తాన్ ఆర్మీ

Imran Khan Pak Army : పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ఆర్మీ(Imran Khan Pak Army) ఉక్కు పాదం మోపిందా. అవున‌నే సమాధానం వ‌స్తోంది. ప్ర‌త్యేకించి ఆయ‌న‌కు సంబంధించిన క‌వ‌రేజీ ఇవ్వ కూడ‌దంటూ ఆయా పాకిస్తాన్ కు చెందిన మీడియా సంస్థ‌ల‌ను ఆదేశించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని పీటీఐ పార్టీ కూడా ఆరోపిస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న అరెస్ట్ పై ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌ధానంగా అప్ప‌టి ఆర్మీ చీఫ్ వ‌ల్ల‌నే తన‌పై కుట్ర జ‌రిగింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇదే స‌మ‌యంలో పాకిస్తాన్ పారా మిలిట‌రీ అత్యుత్సాహంతో ఇస్లామాబాద్ కోర్టు ఆవ‌ర‌ణ‌లో ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండానే అరెస్ట్ చేయ‌డాన్ని ఆ దేశానికి చెందిన సుప్రీంకోర్టు తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఆపై ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంది. ఈ తీర్పును అధికార పార్టీ తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఇమ్రాన్ ఖాన్ బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు భ‌య‌ప‌డి న్యాయ‌మూర్తులు ఆయ‌న‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారంటూ పాకిస్తాన్ మంత్రి ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్ మిల‌ట‌రీ ఈ వారంలో దేశంలోని ప్ర‌ధాన మీడియా సంస్థ‌ల య‌జ‌మానుల‌పై ఇస్లామాబాద్ కు ఆహ్వానించింది. కొన‌సాగుతున్న రాజ‌కీయ‌, రాజ్యాంగ సంక్షోభంపై క‌వ‌రేజీని చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ఇందులో ప్ర‌ధానంగా ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించి త‌క్కువ‌గా ఇవ్వండ‌ని, హైలెట్ చేయొద్ద‌ని ఆదేశించిన‌ట్లు టాక్. ఇదిలా ఉండ‌గా ఖాన్ క‌వ‌రేజీలో టాప్ లో ఉండ‌గా ఇప్పుడు క‌నిపించ‌డం మానేశాడు. ఆర్మీ ఆదేశాల వ‌ల్ల‌నే ఇలా జ‌రిగింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : WTC Final 2023 : స‌మ ఉజ్జీల పోరుకు స‌న్న‌ద్ధం

 

Leave A Reply

Your Email Id will not be published!