#PAKvSA : చెలరేగిన పాకిస్తాన్ తల వొంచిన సౌతాఫ్రికా
నౌమాన్ ఆలీ అద్భుత బౌలింగ్
Pakistan : ఈసారి దాయాదులైన ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ టీంలకు కలిసొచ్చినట్లుంది. టీమిండియా ఆసిస్ తో జరిగిన టెస్ట్ సీరీస్ నెగ్గి రికార్డు సృష్టిస్తే ..మన దాయాదీ పాకిస్తాన్ అదే బాటలో నడుస్తోంది. కరాచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో చెలరేగింది. దీంతో పటిష్టమైన దక్షిణాఫ్రికా తల వంచక తప్పలేదు. ఏడు వికెట్ల తేడాతో ఘనం విజయం సాధించింది.
ఓవర్ నైట్ స్కోర్ నాలుగు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. తిరిగి ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో 245 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా టీంలో ఒకే ఒక్కడు తెంబా బవుమా మూడు ఫోర్లతో 40 పరుగులు చేశాడు. అతడొక్కడే పాకిస్తాన్(Pakistan )బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు.
కేవలం 58 పరుగులే చేసి ఆరు కీలకమైన వికెట్లు పోగొట్టుకుంది. తొలి టెస్ట్ ఆడిన లెఫ్టార్మ్ స్పిన్నర్ నౌమాన్ ఆలీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్(Pakistan )విక్టరీలో కీలక పాత్ర పోషించాడు. మరో లెగ్ స్పిన్నర్ యాసిర్ షాకు 4 వికెట్లు దక్కాయి.
అనంతరం సఫారీ టీం ఇచ్చిన 88 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది పాకిస్తాన్. కేవలం 22. 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. పాకిస్తాన్ జట్టులో నాలుగు ఫోర్లతో 31 పరుగులు చేసి 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా ,
కెప్టెన్ బాబర్ ఆజమ్ 6 ఫోర్లతో 30 పరుగులు చేసి రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన ఫవాద్ ఆలమ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అత్యధిక వయసులో 5 వికెట్లు తీసిన ఆటగాడిగా ఆలీ నిలిచాడు.
No comment allowed please