Imran Khan Arrest Illegal : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్దం
సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్
పాకిస్తాన్ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్దమని ప్రకటించింది. కోర్టు చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఉపశమనం కోసం ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థనను విన్నది కోర్టు. ఒక కేసులో హాజరయ్యేందుకు ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చారు. ఆయనను పారా మిలటరీ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు ఎన్ఏబీని తీవ్రంగా తప్పు పట్టింది.
ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) కస్టడీలో ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని మద్దతుదారుల హింసాత్మక నిరసనల మధ్య ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్తాన్ అత్యున్నత అవినీతి నిరోధక సంస్థ అరెస్ట్ చేయడం చట్ట విరుద్దమని మండిపడింది. మాజీ ప్రధానిని వెంటనే విడుదల చేయాలని ఆ దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పు చెప్పింది.
ఇమ్రాన్ ఖాన్ ను సుప్రీంకోర్టుకు తీసుకు రావాలని ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియల్ , జస్టిస్ మహమ్మద్ అలీ మజార్ , జస్టిస్ అథర్ మినాల్లాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
అంతే కాకుండా ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టుకు తిరిగి రావాలని కోర్టు ఏది నిర్ణయిస్తుందో దానిని అనుసరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిజిస్ట్రార్ అనుమతి లేకుండా ఒక వ్యక్తిని కోర్టు ప్రాంగణం నుండి అరెస్ట్ చేయలేమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
