Imran Khan : పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు
మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వమేనంటూ ఆరోపించారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఇప్పటికే ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలో ఓ కేసు విషయమై హాజరైన ఖాన్ ను పాకిస్తాన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ హింసాత్మక నిరసనలకు దారి తీసింది.
ఈ తరుణంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్దమని తీర్పు చెప్పింది. దీంతో ఇస్లామాబాద్ కోర్టు రెండు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తన నివాసానికి చేరుకున్నారు. తాజాగా తన ఇంటిని పోలీసులు చుట్టుముట్టిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇమ్రాన్ ఖాన్. దీంతో మరోసారి పాకిస్తాన్ అంతటా నిరసనలు, ఆందోళనలు చెలరేగే ప్రమాదం పొంచి ఉంది. తనను అరెస్ట్ చేయడం ఖాయమని పేర్కొన్నారు.
Also Read : TTD Tickets